Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి
నవతెలంగాణ -ధరూర్
జిల్లాలో పోషకాహార లోపం లేని సమాజాన్ని తయారు చేసేందుకు ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ టీచర్లు, ఎఎన్ఎం, ఆశా కార్యకర్తలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గురువారం జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని కె ఎస్ ఫంక్షన్ హాల్ లో మహిళ, శిశు, దివ్యాంగ, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రక్తహీనత పోషకాహార లోపంపై ఏర్పాటు చేసిన అవగాహన శిబిరానికి గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అదనపు కలెక్టర్ శ్రీహర్షతో కలిసి జ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ ఇంత పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమా నికి హాజరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా పిల్లలలో, గర్భిణీ స్త్రీలలో పోషకాహార లోపం రాకుండా ప్రజాప్రతినిధులు ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు కృషి చేయాల న్నారు. మల్దకల్ మండలంలో 500 మంది, గట్టులో 400 మంది పోషకాహార లోపం పిల్లలు ఉన్నట్లు సర్వే చేశారని, వారికి పోషకాహార లోపం లేకుండా చేయాలని అన్నారు. ఎత్తుకు తగ్గ బరువును బట్టి పిల్లల ఎదుగుదల ఉంటుందని తెలిపారు. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మేధాశక్తి పెరుగుతుందని, నేటి బాలలె రేపటి పౌరులని అన్నారు. సరైన ఆహారం ఇస్తేనే వారికి ఎదుగుదల ఉంటుందని అన్నారు .బాల్యవివాహాలు చేయరాదని ,బడి ఏడు పిల్లలను పనికి కాకుండా బడికి పంపేలా చూడాలన్నారు. విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ప్రతి నెల రెండవ మంగళవారం సమావేశానికి హాజరై గ్రామంలోని పోషకాహార లోపం ఉన్న వారిని గుర్తించి చర్చిం చాలని, లబాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఈ సమావేశానికి ప్రజాప్రతినిధులు కూడా హాజరుకావాలన్నారు. జిల్లాలో పోషకాహార లోపం లేని గ్రామాన్ని గుర్తిస్తే ఆ గ్రామ సర్పంచ్, అంగన్వాడీ కేంద్రానికి రిపబ్లిక్ డే రోజు బహుమతి అందజేస్తామన్నారు.
ఎమ్మెల్యేమాట్లాడుతూ పోషకాహార లోపం లేకుండా జిల్లా అధికారులు, అంగన్వాడీ కార్యకర్తలు చూడాలని తెలిపారు. గట్టు మండలాన్ని అభివృద్ధి చేసేందుకు అక్షరాస్యతలో వారికి ప్రభుత్వ పథకాలు అవగాహన అయ్యేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ శ్రీహర్ష మాట్లాడుతూ బరువు తక్కువ ఉన్న పిల్లలను గుర్తించి వారికి బల వర్ధకమైన ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం పౌష్టికాహారం, రక్తహీనత గురించి రిసోర్స్ పర్సన్ డాక్టర్ నరసిం హారావు, సుధాకర్, డాక్టర్ కిషోర్లు అంగన్వాడీ టీచర్లకు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిం చారు. అంతకుముందు అంగన్వాడి టీచర్ల తయారుచేసి పౌటికాహార ప్రదర్శనను వారు పరిశీలించారు.
అనంతరం బతుకమ్మ సంబరాలలో పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో విజయ నాయక్, డిఎంహెచ్ఓ చందునాయక్, డిప్యూటీ సీఈఓ ముసాయిదా బేగం, జడ్పీ వైస్ చైర్మన్ సరోజమ్మ, గ్రంథాలయ చైర్మన్ రామన్ గౌడు, జడ్పిటిసిలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు సర్పంచులు, సిడిపివోలు, సూపర్వై జర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.