Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పాలమూరులో మూడు గంటల పాటు కురిసిన భారీ వర్షం
- లోతట్టు ప్రాంతాలు జలమయం
- ఇబ్బందులు పడ్డ ప్రజలు
- కాలనీల్లో పర్యటించిన అదనపు కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్ చైర్మన్ , కమిషనర్
నవతెలంగాణ -మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ పట్టణంలో మధ్యాహ్నం 1 గంట నుండి 3 వరకు వర్షం దంచి కొట్టింది. దీంతో పట్టణం లోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. మూడు గంటల పాటు కుండ పోతగా వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. 15 నుండి 20 మిల్లీమీటర్ల వర్షం నమోదైనట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షంతో దీంతో లోతట్టు ప్రాంతాలైన రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, శివశక్తి నగర్ పూర్తిగా నీటిలో మునిగిపోయాయి. గణేష్‌నగర్, వన్‌టౌన్ సమీపంలో రాయిచూరు రహదారిపై భారీగా వర్షం నీరు పారింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందన్ లా ల్ పవర్, జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ కోరమోని నరసింహులు, కమిషనర్ ప్రదీప్‌కుమార్ లోతట్టు ప్రాంతాలను సందర్శించా రు. ప్రజలకు ఇబ్బందులు కలగ కుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తు న్నట్లు వారు తెలిపారు. జాతీయ స్థా యి క్రీడల ప్రారంభోత్సవానికి వెళ్లిన రాష్ట్ర ఎక్సైజ్ క్రీడలు సాంస్కృతిక సమాచార శాఖ మంత్రి గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నుండి అధికారులతో వివరాలను తెలుసుకు న్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బం దులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఆయన అక్కడి నుంచి అధికారులను ఆదేశించారు. లోతట్టు ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు.