Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెబ్బేరు: ఉమ్మడి వీపనగండ్ల చిన్నంబావి మండలలాతో పాటు పెంట్లవెల్లి మండలంలోని జూరాల చివరి ఆయకట్టు భూములకు తక్షణమే సాగునీరు అందించి పంటలను కాపాడాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కమిటీ సభ్యులు, కొల్లాపూర్ నియోజక జగదీశ్వర్ రావు డిమాండ్ చేశారు. బుధవారం వీపనగండ్ల, చిన్నంబావి, పెంట్లవెల్లి మండలాలలోని గ్రామాలు సంపత్రావుపల్లి, గోప్లాపూర్, సింగవరం, వెల్టూరు, చిన్నమారు, పెద్ద మారు గ్రామాలలోని ఎండిపోయిన పంటలను సంద ర్శించి, తక్షణమే జూరాల ఎడమ కాలువ నుండి, చిన్నమారు లిఫ్ట్ ఇరిగేషన్ ఆయకట్టు కింద సాగు చేసుకుంటున్న పంట పొలాలకు నీటిని విడుదల చేయాలనీ డిమాండ్ చేశారు. లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులను ఏకం చేసి ఆందోళన ఉధృతం చేస్తామని పెబ్బేరులోని బీమా ప్రాజెక్ట్ ఎస్ఈ సత్యసిరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్ర మంలో పెబ్బేరు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ వర్ధన్ రెడ్డి, చిన్నంబాయి, మండల అధ్యక్షులు చంద్ర శెఖర్,పాన్ గల్ మండల అధ్యక్షులు మధు సుధన్ రెడ్డి, కొల్లాపూర్ మండల అధ్యక్షులు పరుషా రాము నాయుడు, ఏ బ్లాక్ అధ్యక్షులు రాము యదయ్, బి బ్లాక్ అధ్యక్షుడు కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.