Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు
నవతెలంగాణ- కోస్గి
పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వహించాలని, మంచి క్రమ శిక్షణ కలిగియుండి సమయపాలన పాటించాలి నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా గురువారం కోస్గి పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వ కంగా మాట్లాడాలని, వారు ఇచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం పొం దేలా చేయాలని ఆదేశించారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ తమకు కేటాయించిన గ్రామలకు వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో గాని తమ సర్వీస్ కు సంబంధించి ఏలాంటి సమస్యలు ఉన్న నేరుగా నాకు తెలుపవచ్చని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకొని, వెంటనే పెండింగ్ కేసులను పూర్తి చేయాలని తెలిపారు. దొంగతనాలు నిర్మూలన గురించి గ్రామాలలో, కాలనీలలో, షాపింగ్ మాల్స్‌లో, దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. అలా గే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలి పారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి పోలీస్ స్టేషన్లో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో సిఐ జనార్దన్ , ఎస్సైలు జగదీశ్వర్ రెడ్డి, నరేష్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.