Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- పెబ్బేరు
గత కొన్ని రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా పిఎంపి డాక్టర్లుగా కొనసాగుతున్న గ్రామీణ వైద్యులు పరిధికి మించి రోగులకు పరీక్షలు నిర్వహిస్తుండడంతో రోగులకు తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని సమాచారం అందింది. దీంతో అధికారులు విభాగాలుగా విడిపోయి తనిఖీలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం పెబ్బేరు మండల కేంద్రంలో డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పీఎంపీ డాక్టర్లు నిర్వహిస్తున్న క్లినికులను పరిశీలించారు. తనిఖీల్లో ఆశ్చర్యకరమైన విశేషాలు ఏమిటంటే రెండు సంవత్సరాల క్రితం పరిధికి మించి రోగులకు పరీక్షలు నిర్వహిస్తున్నారని గతంలో పనిచేసిన డిఎంహెచ్ఓ శీనివాసులు వారికి తీవ్ర హెచ్చరిక జారీ చేసి సక్రమంగా ఉండనిచో క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినప్పటికీ తీరు మార్చుకోలేదు. గత రెండు సంవత్సరాలుగా అధికారులు ఎలాంటి తనిఖీలు నిర్వహించ కపోవడంతో మళ్లీ అదే తీరు కొనసాగింది. మండల కేంద్రంలోని పీఎంపి వైద్యుడు తన క్లినిక్ లో ఇద్దరు రోగులకు సెలూన్ బాటల్ ఎక్కిస్తూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గమనించిన డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఇలా చేస్తే రోగులకు ఏదైనా ప్రమాదం వస్తే ఎవరు బాధ్యులని వైద్యుని పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ఇలానే చేశారని జిల్లా వైద్యాధికారులు గుర్తు చేశారు. ప్రముఖ వైద్యుల అవతారం ఎత్తి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తూ వారికి అధిక ధరలైన ఆంటీబయాటిక్స్ మందులను కూడా రాస్తున్నారు. ఈ విషయాలన్నీ తమ దృష్టికి వచ్చాయని వైద్య అధికారులు తెలిపారు. మండల కేంద్రంలోని శ్రీ వెంకట సాయి సరోజిని ఆసుపత్రిలను వైద్యాధికారులు తనిఖీ లు నిర్వహి ంచారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు విపరీతంగా పెరిగిపోవడంతో వాటిని సొమ్ము చేసుకుంటున్నారు ఇకపై నిబంధ నలకు విరుద్ధంగా పరిధికి మించి పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని వైద్యాధికారి హెచ్చరించారు. ఈ తనిఖీలలో వైద్య సిబ్బంది నరసింగరావు తదితరులు పాల్గొన్నారు.