Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట టౌన్ : నారాయ ణపేట మండల పరిధిలోని కోటకొండ గ్రామానికి వెళ్లే ఆర్ అండ్ బి రోడ్డు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు తీవ్రంగా దెబ్బతినదని సీపీఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ నాయకులు తెలిపారు. ఈ విషయమై సిపిఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ నాయకులు ఆర్ అండ్ బి అధికారులతో మాట్లాడి రోడ్డు పనులు చేయించాలని విన్నవించగా తూతూ మంత్రంగా మొరం వేసి చేతులు దులుపుకున్నారు. ఈ విషయమే సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకొని మొరంను రోడ్డుకు సరిచేయాలని గ్రామ ప్రజలు, సీపీఐ ఎంఎల్ ప్రజాపంతా పార్టీ నాయకులు కోరారు.