Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కందనూలు
నాగర్ కర్నూల్ జిల్లా సాయి గార్డెన్ లో ఐసిడిఎస్ ద్వారా అధికారికంగా నిర్వహించిన పోషక మాసం వేడుకల్లో సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ పి.ఉదరు కుమార్ మాట్లాడుతూ పోషక ఆహార విలువలకు సంబంధించిన సమాచారాన్ని ఈ కార్యక్ర మం ద్వార ఈ సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం ఒక నెల రోజుల పాటుగా వివిధ కార్యక్రమాలు చేశామన్నారు. . ఏ కార్యక్రమం చేసినా మనకు ఫలితం త్వరగా తెలిసిపోతుంది కానీ ఐసీడీఎస్ ద్వారా నిర్వహించిన పౌష్టికాహార కార్యక్రమంలో దాదాపు మూడు నెలల వరకు ఫలితం బయటకు కనిపించదు అని అన్నారు. ప్రత్యేకంగా ఎనీమియా కేసులను గుర్తించి వారి పై పూర్తి శుద్ధ వహించాలన్నారు.ఈ మధ్యకాలంలో ఆస్పత్రులలో ఎనీమియా కేసులు వసూతి సమయంలో అనేక సమస్యలతో బాధపడుతున్నారు వారికి చివరి ప్రయత్నంలో చేసే సహాయం కాకుండా ఎనిమీ అని గుర్తించి తగిన పౌష్టికాహారాన్ని ఇచ్చి గర్భిణీ స్త్రీలకు పిల్లలకు ఆరోగ్య జాగ్రత్తలు చెబుతూ పౌష్టిక ఆహారాన్ని అందించాలని అన్నారు. అంగన్వాడి కేంద్రాలలో గర్భిణి స్త్రీలు నేలపై కూర్చొని ఆహారం తీసుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని జిల్లా కలెక్టర్ గారు అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణీ స్త్రీలు కుర్చీల పైన కూర్చొని ఆహారం తీసుకునే విధంగా 55 బెంచీలు 220 కుర్చీలు బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా మంజూరు చేస్తూ కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కల్పనా భాస్కర్ గారు జెడ్పి సీఈవో జిల్లా శిశు సంక్షేమ అధికారి, ఐసిడిఎస్ సిబ్బంది ఇతర అధికారులు పాల్గొన్నారు.