Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహాత్ముడికి ఇచ్చే గౌరవం ఇదేనా..?
నవతెలంగాణ- కందనూలు
గాంధీ జయంతి సమీపిస్తుంది. దేశ విదేశాల్లో ఏర్పాటు చేసిన అన్ని గాంధీ విగ్రహాల దగ్గర మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ప్రజలు. భారత దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం, కృషిని తలుచుకొని కొనియాడుతారు. గాంధీ జయంతి సమీపిస్తుంది. దేశ విదేశాల్లో ఏర్పాటు చేసిన అన్ని గాంధీ విగ్రహాల దగ్గర మహాత్ముడికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారు ప్రజలు. భారత దేశ స్వాతంత్య్రం కోసం మహాత్ముడి పోరాటం, కృషిని తలుచుకొని కొనియాడుతారు. విగ్రహాల వద్ద అలంకరణ చేసి ఘనంగా కార్యక్ర మాలు చేపడతారు. దేశ విదేశాల్లో గాంధీ విగ్రహాలకు ఇంతటి గౌరవం కల్పిస్తుండగా.. నాగర్కర్నూల్ జిల్లా లోని ఓ గాంధీ విగ్రహం మాత్రం నిర్లక్ష్యానికి గురవు తుంది. గత 10 ఏళ్లుగా ఆ విగ్రహం నిరాదరణకు నోచుకుంటుంది. గ్రామం నడిబొడ్డున ఉన్నప్పటికీ దయనీయమైన పరిస్థితిలో గాంధీ విగ్రహం ఉంది. ఎందుకని ఆరా తీయగా ఆ గాంధీ విగ్రహం ఒక ప్రహరీ గోడలో బందీ అయింది. నాగర్కర్నూల్ జిల్లా తుడుకుర్తి గ్రామంలో 40 ఏళ్ల క్రితం ఆర్ఎంపీ డాక్టర్ నర్సోజి అనే వ్యక్తి గ్రామస్తుల సహకారంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. భూత్పూర్ మండలం కొత్త మొలగర గ్రామం నుంచి వలస వచ్చిన నర్సోజి...చాలాకాలం పాటు తుడుకుర్తి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందించారు. వైద్య సేవలు అందిస్తున్న క్రమంలో గాంధీ మహాత్ముడిపై అభిమానంతో అక్కడి గ్రామస్తుల సహకారంతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు నర్సోజి. అప్పటి నుంచి ప్రతి ఏటా గాంధీ జయంతి ఆ గ్రామస్తులంతా గాంధీ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పిస్తూ వచ్చేవారు. కాగా, 10 ఏళ్ల క్రితం ఓ దేవాలయ ప్రహరీ గోడ నిర్మాణం నిమిత్తం జరిగిన నాటకీయ పరిణామాలు ఆ గాంధీ విగ్రహాన్ని గోడలో బందీగా చేశారు. దేవాలయ భూమిలో గాంధీ విగ్రహం ఉందని అక్కడి వరకు ప్రహరీ గోడ నిర్మించగా, ఆ గోడ సరిగ్గా గాంధీ విగ్రహం మీదుగానే వెళ్ళింది. విగ్రహాన్ని కనీసం పక్కకు జరపకుండా గాంధీ విగ్రహం గుండా ప్రహరీ గోడ ఏర్పాటు చేశారు. దీంతో ఆ విగ్రహం ఆనాటి నుంచి ప్రహరి గోడలో బందీ అయింది. అప్పటి నుంచి ఈ గాంధీ విగ్రహానికి ఎలాంటి నివాళులు అర్పించడం లేదు. ఈ విగ్రహాన్ని గోడలో బందీగా ఉండడాన్ని చూసిన గాంధీ అభిమానులు పలుమార్లు ప్రభుత్వ అధికారులకు నివేదనలు అందించారు. విగ్రహాన్ని తొలగించాలని గాంధీ గౌరవాన్ని కాపాడాలని కోరారు. అయినప్పటికీ ప్రభుత్వ అధికారులు స్పందించకపోవడంతో గాంధీ విగ్రహం ఇప్పటికీ గోడలోనే బందీగా ఉంది.అప్పటి నుంచి ఈ గాంధీ విగ్రహానికి ఎలాంటి నివాళులు అర్పించడం లేదు. ఈ విగ్రహాన్ని గోడలో బందీగా ఉండడాన్ని చూసిన గాంధీ అభిమానులు పలుమార్లు ప్రభుత్వ అధికారులకు నివేదనలు అందించారు. విగ్రహాన్ని తొలగించాలని గాంధీ గౌరవాన్ని కాపాడాలని కోరారు.
శిథిలావస్థలో ఉన్న విగ్రహాన్ని తొలగించాలి: శంకర్
నాగర్కర్నూల్, తూడుకుర్తి గ్రామాలకు చెందిన ఆర్యవైశ్య సంఘం నాయకులు చందాలు వేసుకొని 2013లో రూ. 2 లక్షల రూపాయలతో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఏడాది నివాళులు అర్పిస్తున్నారు. గోడలో బందీగా ఉన్న గాంధీ విగ్రహాన్ని తొలగించి ఆయన విగ్రహానికి సముచిత గౌరవం కల్పించాలని తూడుకుర్తి గ్రామస్తులు కోరారు.