Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముగోనిపల్లి గ్రామంలో కాగితాల పైన అభివృద్ధి అనే విధంగాసర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ప్రభుత్వ స్థలం లేదు. పల్లె ప్రకృతి వనం,తోపాటు డంపింగ్ యాడ్ శ్మశాన వాటిక సైతం స్థలాలు లేకపోవడం కారణంగా సమీప గ్రామ మైన ఆమ్లెట్ విలేజ్ అయినా తోతినొని దొడ్డి గ్రామానికి తరలించారు.
- చేయి తడపనిదే పనికాదు !
- ప్రతి పనికొరేటు లంచం లేనిదే పనిచేయని కార్యదర్శి
- రాజకీయ ఒత్తిడితో అర్హులైన పింఛన్ తొలగించిన దుస్థితి
- గ్రామ ప్రజల ఆరోపణలు
- రాష్ట్ర ప్రభుత్వం బంగారు తెలంగాణ లక్ష్యం: ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ - అయిజ
అయిజ మండలంలోని ముగోనిపల్లి గ్రామానికి వర్తించవని అనే విధంగా అధికారులు. పని చేయక పోవడంతో అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. మండలంలోని ముగోనిపల్లి గ్రామంలో కాగితాల పైన అభివద్ధి అనే విధంగా సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యం కారణంగా గ్రామంలో ప్రభుత్వ స్థలం లేదు. పల్లె ప్రకృతి వనం,డంపింగ్ యాడ్ శ్మశాన వాటిక సైతం స్థలాలు లేకపోవడం కారణంగా సమీప గ్రామ మైన ఆమ్లెట్ విలేజ్ అయినా తోతినొని దొడ్డి గ్రామానికి తరలి ంచారు. తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసి అన్ని వసతులు ఏర్పాటు చేయాలని ఆదేశించి నప్పటికీ గ్రామ పంచాయతీ ముందు క్రీడా ప్రాంగణం అనే బోర్డు పెట్టి అధికారులు చేతులు దులుపుకున్నారు. అందులో ఆడుకోవడానికి ఎలాంటి సౌకర్యాలు లేక పోవడంతో ఇదేనా క్రీడా ప్రాంగణం అంటూ ఏవిధంగా పదిఫీట్లస్థలములోక్రీడా ప్రాంగణం అధికారులు చూపించారని గ్రామ వాసులు ప్రశ్నించారు ఏదైనప్పటికీ ప్రస్తుతం గ్రామ అభివృద్ధి ఎంత ఉందో ఊహించుకోవచ్చు. గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ తాగు నీరు ఈ గ్రామంలో పూర్తి చేయకపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఏర్పడింది. అంతే కాకుండా గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్మికుల తో చేయాల్సిన పనులు చేయించక పోవడంతో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న సామెతగా చెత్త మురుగు నీరు సైతం రోడ్డు పైనే ఉన్న పట్టించుకునే నాధుడు కరువై యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుండా ప్రతి పనికి ఒక రేటు పెట్టి మ్యారేజ్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, పింఛన్లకు సైతం డబ్బులు చెల్లిస్తే గాని పనులు జరగడం లేదని, ప్రజలు తీవ్రంగా మండిపడ్డారు గ్రామ సభ సైతం నిర్వహించకుండా, సర్పంచ్,పంచాయతీ కార్యదర్శి సమక్షంలో వారికి ఇష్టం వచ్చిన పని చేస్తామని ఏవిధంగా, ప్రశ్నించిన వారిని ఇతర నాయకులకు చెప్పి వారి చేత., భయబ్రాంతులకు గురిచేస్తు న్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పింఛన్ తొలగిం చడంపై ఎంపీడీవో మొదలుకొని, జిల్లా కలెక్టర్ కి పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవడంతో ఎంపీడీవో కి పైసల్ ఇవ్వడంతో పెన్షన్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు గ్రామానికి చెందిన యువకులు అన్నారు.
ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు
కోరగా గ్రామంలో తనపై సర్టిఫికెట్లు మొదలుకొని కల్యాణలక్ష్మి, పుట్టిన రోజు , డెత్, పెన్షన్ల సైతం ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం లేదు. సరైన గడువులో రాకపోవడం కారణంగా వారితో ఎస్టిఓలో చలానా చెల్లించి ఇవ్వాలి. ఈ విషయంలో డబ్బులు అడుగుతున్నామని ఆరోపణలు వచ్చాయి.అందులో వాస్తవం లేదు.
- సంధ్యారాణి , పంచాయతీ కార్యదర్శి