Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందనూలు : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ఉదరు కుమార్ సూచించారు.శుక్రవారం తాడూర్ మండలం ఆకునెల్లి కుదురు వద్ద రోడ్డు పై నుండి ఉధృతంగా పడుతున్న కాలువను రెవెన్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ వెంటనే బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరు రోడ్డు దాటకుండా కాపలా పెట్టాలని ఆదేశిం చారు. ఇంకో రెండు రోజులు ఇదేవిధంగా వర్షాలు ఉన్నందున రెవెన్యూ, పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఎలాంటి ప్రాణ హాని కలుగకుండా చూడాలని ఆదేశించారు. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లు, నీరు నిల్వ ఉండే ప్రదేశాలకు ఎవరూ వెళ్లొద్దన్నారు. దుస్తులు ఉతికేందుకు, ఈత కొటేటందుకు, చేపలు పట్టేందుకు వెళ్లొద్దన్నారు. ఏదైన సమాచారం ఉంటే కంట్రోల్ రూమ్ నంబర్ 08540- 230201కు తెలుపాలన్నారు. ఎంపీడీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు అప్రమత్తమై ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందజేయాలని ఆదేశించారు.