Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కందనూలు : దళిత జర్నలిస్టుల ఉమ్మడి జిల్లా సమావేశాన్ని అక్టోబర్ 8వ తేదీ శనివారం ఉదయం 11 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో నిర్వహించారు. దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని దళిత జర్నలిస్టుల ఫోరం నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు వృత్తిని పవిత్రంగా భావించి, ఆదాయం లేకున్నా, ప్రజా సమస్యలపై నిరంతరం ఎప్పటి కప్పుడు ప్రజలకు ఇక్కడ ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజల చైతన్య పరచడంలో తమ యొక్క బాధ్యత నిర్వహిస్తు న్నారని,కావున తెలంగాణ రాష్ట్రంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న దళిత జర్నలిస్టులందరికి రెండవ విడత దళిత బంధులో మొదటి ప్రాధాన్యత కల్పించాలని దళిత జర్నలిస్టుల ఫోరం ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.