Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారాయణపేట టౌన్ : జిల్లా కేంద్రంలోని బాబు జగ్జీవన్ రామ్ జూనియర్ కళాశాలలో శుక్రవారం ఘనంగా భగత్ సింగ్ 115 వ జయంతిని ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించారు. భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు .ఈ సెమినార్ ముఖ్య అతిథులుగా హైకోర్టు లాయర్ డివైఎఫ్ఐ రాష్ట్ర మాజీ అధ్యక్షులు విప్లవ కుమార్ హాజరై మాట్లాడుతూ భగత్ సింగ్ కులమతాలకు అతీతంగా దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేశాడని అన్నారు. ఆయన చేసిన పోరాటాన్ని నేటి యువతీ యువకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పాఠ్యాంశాలలో భగత్ సింగ్ జీవిత చరిత్ర చేర్చాలని నేటి విద్యార్థులకు పోరాటస్ఫూర్తి భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలలో చేర్చాలని, భగత్ సింగ్ 115 నవ జయంతిని భారత స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి తన ప్రాణాన్ని ఉరికంబం పై అవలీలగా వదిలిన పోరాట యోధుడు భగత్ సింగ్ అని కొనియాడారు. కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమూద్ అలీ, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి నరహరి ఎస్ఎఫ్ఐ ఉస్మానియా అధ్యక్షులు ఆంజనేయలు, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కాశి, మహేష్, జిల్లా నాయకులు నరేష్, వెంకటేష్, పవన్, తిరుపతి, వెంకటేష్ ,భాగ్య, వరలక్ష్మి, సౌమ్య, ఐశ్వర్య, మౌనిక, స్వప్న, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు కనకప్ప, ఆంజనేయులు, వెంకటేష్, మరియు కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.