Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- వనపర్తి
వసతి గృహాలలో చదువుకునే విద్యార్థులు రోజువారి తీసుకునే ఆహారం, ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు. శుక్రవారం తెలంగాణ మైనారిటీ గురు కుల పాఠశాలలో ఆర్ఎల్సి. హవిలా రాణి ఆధ్వర్య ంలో విద్యార్థుల ఆహారం, ఆరోగ్యం, భద్రత అంశాలపై ఏర్పాటుచేసిన ఒక్కరోజు అవగాహన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీ, కేజీబీవీ మోడల్ పాఠశాలల విద్యార్థులు ఆయా వసతి గృహాలలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారని, వారికి సరైన పౌష్టికాహారం ఆహారం అందించటం వసతి గృహాలలోని వార్డెన్ల బాధ్యతని ఆమె తెలిపారు. సీజనల్ వ్యాధుల పట్ల, పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి విద్యార్థులకు అవసరమైన చికిత్స అందించాలని ఆమె సూచించారు. విద్యార్థులు చదువు తోపాటు, క్రీడలలో రాణించేలా చర్యలు చేపట్టాలని ఆమె అన్నారు. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యతనిస్తూ జిల్లాలో అనేక గురుకుల పాఠశాలలను నిర్మించి, నాణ్యమైన విద్యను అందిస్తున్నదని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారిని క్రాంతి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారిని నుషిత. గిరిజన సంక్షేమ అధికారి శ్రీనివాస్, వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి శంకర్, మాస్టర్ ట్రైనర్లు ఆనంద్, సౌమ్య, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.