Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అడవిబిడ్డలకు ఆవాసాలేవీ ?
- అమ్మకాలకు డబల్బెడ్రూములు ?
- అడవిగడ్డి, కాశతో ఇండ్ల నిర్మాణాలేనా?
- ఆందోళనలో బాధితులు
- పెరుగుతున్న అక్రమార్కుల ఆగడాలు
- పట్టించుకొని పాలకులు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సొంతింటి కల నెరవేరుతుందనుకున్నాం. వాన వచ్చినా.. చలిపెట్టినా అడివి బిడ్డాలకు బాధలు తప్పటంలేదు. ప్రతి ఏటా అడవి గడ్డి కోసం తిరిగే పని తప్పుతుందనుకున్నాం.వర్షంనీరు ఇల్లంతా రాత్రంతా జాగారం నుంచి ఉపశమనం ఉంటుందనుకున్నాం.కాని కనుచూపు మేరల్లో అటువంటి ఆశలు నెరవేరేలా లేవు. అధికారుల అలసత్వం అక్రమార్కుల అగడాల వల్ల నిజమైన లబ్ధిదారులకు ఇండ్లు ఇవ్వడంలేదని పలువురు ఆరోపిస్తున్నారు. తాజాగా బీజేపీకి చెందిన ఓ పైరవీకారు మాయ మాటలు చెప్పి లబ్దిదారుల నుండి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. అంగట్లో సరుకుల్లాగా నకిలీ మాఫియా తప్పుడు దృవీకరణ పత్రాలు సృష్టించి ఒక్కో ఇంటిని రూ. 5 లక్షలకు పైగా బేరం పెడుతున్నారు. దీంతో నిజమైన లబ్దిదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. సింగల్ రూము లేక డబల్బెడ ్రూములు వచ్చే అవకాశాకలు కనబడటం లేదని ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఉమ్మడి జిల్లాలో 5 లక్షల మందికి పైగా సొంతిండ్లు లేనివారున్నారని నివేదిక ఇచ్చారు. ఇందులో దళితులు లక్షన్నర, చెంచులు 7 వేలు, గిరిజనులు 70 వేల మంది సొంతిండ్లు లేనివారున్నారు. ముఖ్యంగా నల్లమల చెంచులు,దళితులు, బీసీలు, నేటికీ అడవి గడ్డి కాశతో గుడిసెలను వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు.అప్పపూర్ 25 కుటుంబాలు, మల్లాపూర్ పెంటలో 12 , బౌరాపూర్, సార్లపల్లి తదితర చెంచుపెంటలు నేటికి గుడారాలలో ఉన్నారు. ఇక నారాయణపేట జిల్లాకు వస్తే పెంకుటిళ్లు, బండ చెక్కలతో తయారు చేసిన ఇండ్లలోనే కాపురాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం వీరందరికి పక్కా ఇంటి నిర్మాణం చేపడతామని హమీనిచ్చారు. అందులో భాగంగా రూ. 5 లక్షలతో రెండు పడకల గదుల నిర్మాణాన్ని జిల్లాలో మొదలు పెట్టారు. ఉమ్మడి జిల్లాలో 18 వేల ఇళ్లను మొదలు పెట్టాదరని తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోనే సుమారు 2వేలకు పైగానే నిర్మాణం పూర్తి చేశారు. అయితే బాధితులకు ఇవ్వడంలోనే పెద్ద సమస్యగా మారింది. జిల్లా కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న దివిటిపల్లిలో మంత్రి చొరవతో 1024 ఇండ్లు నిర్మాణం చేశారు. నాలుగేండ్ల క్రితం క్రితం ఇండ్లను నిర్మాణం చేశారు. కానీ ఇండ్లను పంపిిణీ చేయడంలో అలసత్వం చేస్తున్నారు. అంతేకాదు కొంత మంది దళారులు నకిలీ డాక్యుమెంట్లను తయారు చేసి లబ్ధిదారులకు ఇచ్చి కోట్ల రూపాయలను సంపాదించారు కూడా. విషయం బయట పడటంతో మంగళవారం ఆరు మందిని అరెస్టు చేశారు. 40 మంది బాధితుల నుంచిరూ. 33 లక్షలు వసూలు చేసి రికవరీ చేశారు.
ఇంకా బయట పడని నిజాలేన్నో..
డబల్‌బెడ్ రూముల విషయంలో మొదటి నుంచి అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాణం చేసిన తర్వాత నిజమైన లబ్ధదారులకు ఇవ్వడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారో తెలియడం లేదు. ఆలస్యమైనా కొద్ధి అక్రమాలు చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రయివేటుగా జరిగిన అక్రమాలు మాత్రమే వెలుగులోకి వచ్చాయి. ఇంకా బయటకు రాని అనేకం ఉన్నా యని అనుమానంగా ఉంది.ముఖ్యంగా అధి కారుల అండదండలతో సైతం కొన్ని ఇండ్లను డబ్బుల ద్వారా అమ్మినట్లు తెలుస్తోంది. సెల్‌పోన్ సంభాషణ ద్వారా వెలుగులోకి వస్తున్నాయి. అధికారులు విచారణ చేపడితే ఇంకా అనేక అమ్రాలు వెలుగులోకి వస్తాయనే విమర్శలు వస్తున్నాయి.
అక్రమార్కుల ఆగడాలను అరికట్టాలి
డబల్‌బెడ్ రూముల విషయంలో అనేక అక్రమాలు జరుగుతున్నట్లు ఆరోపణ లున్నాయి. ఇప్పటికైనా అధికా రులు డబుల్‌బెడ్ రూముల పంపిణీ విషయంలో ఆలస్యం చేయరాదు. వారిచ్చిన డబ్బులు వారికి వెనక్కి ఇచ్చేవిధంగా చూడాలి. లేనిచో ఆందోళన చేయాల్సి వస్తోంది.
- కడియాల మోహన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, మహబూబ్‌నగర్ జిల్లా