Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిమ్మాజీపేట
గ్రామపంచాయతీ కార్మికులను వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని శ్రమకు తగ్గ వేతనం ఇవ్వడం లేదని కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం తిమ్మాజిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్టీపర్పస్ పేరుతో ఒక్కో కార్మికులతో అనేక రకాలైన పనులు చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్ద గ్రామపంచాయతీలలో కూడా ముగ్గురు నలుగురు కార్మికులతో పనులు చేయించుకుంటూ పని భారం మోపుతున్నారని అన్నారు. అందరికీ 8500 వేతనం ఇవ్వడం లేదని 6000, 7000, 8000 రూపాయలు కూడా ఇస్తున్నారని అన్నారు. కారోబార్ బిల్ కలెక్టర్లకు ప్రత్యేక గుర్తింపును ఇవ్వాలని డిమాండ్ చేశారు. నవంబర్ 26 27 తేదీలలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర మహాసభలను జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకుల అశోక్ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ మండల అధ్యక్ష కార్యదర్శులు బాలరాజు, సురేందర్, వెంకటయ్య, సత్యమ్మ ,శ్రీనివాస్, బాలయ్య ,రాము తదితరులు పాల్గొన్నారు.