Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
శాంతిభద్రతల నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహుల పట్ల కఠినంగా వ్యవహరించాలని, అదే సందర్భంలో సామాన్య ప్రజల నమ్మకం చూర గొనేందుకు కషి చేయాలని రాష్ట్ర డీజీపీ ఎం .మహేందర్ రెడ్డి అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేటి శుక్రవారం మధ్యాహ్నం డీజీపీ శాంతిభద్రతల సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ ఆర్.వెంకటేశ్వర్లు జిల్లాకు సంబంధించిన వివరాలు తెలిపారు.పాత కేసుల దర్యాప్తు పూర్తి చేయడంలో సీనియర్ పోలీస్ అధికారుల సమన్వయముతో ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.జైలు నుంచి విడుదలైన పాత నేరస్తుల కదలికలపై పూర్తి స్థాయి నిఘా ఉంచుతామన్నారు. జిల్లాలోని ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డుల నిర్వహణ పట్ల సిబ్బందికి శిక్షణ ఇస్తామని గుర్తు చేశారు.స్థానిక సమస్యలను పరిష్కరించే క్రమంలో విలేజ్ పోలీస్ ఆఫీసర్లకు అవగాహన కల్పించే తరగతులు నిర్వహిస్తామన్నారు. పోలీసు సహాయం అవసరం అయిన అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100 నెంబర్ కు ఫోన్ చేసే విషయంలో అవగాహన కల్పిస్తామని అన్నారు. సమావేశంలో డీఎస్పీలు రమణారెడ్డి, మధు, ఆది నారాయణ, లక్ష్మణ్, ఎస్ఐలు పాల్గొన్నారు.