Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిఐటియూ జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు
నవతెలంగాణ- కల్వకుర్తి
వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరిం చాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్.శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. వి ఆర్ ఎల్ గత 70 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆయన మండిపడ్డారు. పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు చేస్తున్న వీఆర్ఏలకు సిఐటియు నాయకులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల సమస్యలు పరి ష్కరిస్తామని హామీ ఇచ్చి ఇప్పటికీ పరిష్కరిం చకపోవడం ఎంత వరకు సమంజసమని అన్నారు వారికి వెంటనే పే స్కేల్ వర్తింపజేయాలని, కనీస వేతనం 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అంజ నేయులు జేఏసీ చైర్మన్ రమేష్ యాదయ్య రాజు సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: వీఆర్ఏల సమ్మె 70 రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ లో గాంధీ జయంతి రోజున మౌన దీక్షకు దిగి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వీఆర్ఏ జేఏసి చైర్మన్ విజరు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన పే స్కేల్ వెంటనే అమలు చేయాలన్నారు. ఇప్పటికైనా తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిల బెట్టుకోవాలని లేదంటే ఉద్యమాన్ని ఉధతం చేస్తా మని ఆయన తీవ్రంగా హెచ్చరించారు ఈ కార్య క్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పొదిల రామయ్య జిల్లా నాయకులు అశోక్ కాజా భాను మండల చైర్మన్ నిరంజన్ ధర్మేందర్ సలేశ్వరం శేఖర్ సాయి బంగారి హుస్సేన్ బాలస్వామి సాయి బంగారి రాము అశోక్ సరిత పాల్గొన్నారు.
బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూల్ జిల్లా కన్వీనర్ డి.అరవింద్ చారి వీఆర్ఏలకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గాంధీజీ కలలుగన్న స్వతంత్ర రాజ్యం ఇదేనా ఈ జయంతి సందర్భంగా వీఆర్ఏలు మౌన పోరాట దీక్ష గాందేయ యవాదంగా శాంతియుతంగా చేస్తున్నారని. వీఆర్ఏలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా పని చేశారని గుర్తు చేశారు. వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షి ఇచ్చినటువంటి మాటలను సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని లేనిపక్షంలో బీసీ పొలిటికల్ జెసి ఆధ్వర్యంలో ఆందో ళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బిసి సంక్షేమ సంఘం ఉమ్మడి పాలమూరు జిల్లా అధ్యక్షులు కాళ్ల నిరంజన్. వీఆర్ఏ ల జిల్లా చైర్మన్ ఆర్. విజయ్. కాజా భాను. నిరంజన్ సలేశ్వరం ధర్మేందర్ శేఖర్ బాలస్వామి బంగారయ్య. శంకర్. హుస్సేన్. వెంకటయ్య. చెన్నయ్య. అరుణ. వసంత. ఫాతిమా. శశికళ. యశోద. అలివేలు తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి : వీఆర్ఏల జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా వనపర్తి జిల్లా కేంద్రంలో గాంధీ జయంతిని పురస్కరించుకుని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి గాంధీ చౌక్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం గాంధీ విగ్రహం ముందు మౌనదీక్ష చేసి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన ర్యాలీ లో వీఆర్ఏల సంఘం వనపర్తి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.