Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- కల్వకుర్తి
పట్టణంలోని గాంధీ నగర్ కాలనీ లో గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన వైద్య చిత్రం విజయవంతమైంది. ఈ శిబిరాన్ని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలాజీ తదితరులు ప్రారంభించారు. శిబిరంలో పలువురు దాతలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శివరాం రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సత్యం, మాజీ సర్పంచ్ ఆనంద్‌కుమార్, సింగిల్‌విండో చైర్మన్ జనార్దన్ రెడ్డి , గాంధీ నగర్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.