Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఏపీ మల్లయ్య
నవతెలంగాణ- కల్వకుర్తి
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధ్యయన వేదిక జిల్లా కన్వీనర్ ఏపీ మల్లయ్య ప్రభుత్వాన్ని కోరారు. కల్వకుర్తి పట్టణంలోని సీఐటీయూ కార్యాలయంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూని యన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గామ పంచాయతీలలో కార్మి కుల చేత వెట్టిచాకిరి చేయిస్తుందని అన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు కనీస వేతనం 25 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్టీపర్పస్ విధానాన్ని వెంటనే రద్దు చేయా లని కార్మికులకు పండుగలు ఆదివారం సెలవులు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు అంజనేయులు, మండల కార్యదర్శి శంకర్, ఉపాధ్యక్షురాలు బాల మైసమ్మ, పెంటయ్య అర్జున్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.