Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- మహబూబ్నగర్
శాకాహారంతోనే సంపూర్ణ ఆరోగ్యం సిద్దిస్తుం దని మహబూబ్నగర్ డీఎస్పీ మహేశ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని పద్మావతి కాలనీ లోని శ్రీకృష్ణ దేవాలయ కమాన్ వద్ద డీఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ప్రభుత్వ ఆస్పత్రి, బస్టాండ్, అశోక్టాకీస్, వన్ టౌన్, గడియారం చౌర స్తా, తెలంగాణ చౌరస్తా మీదుగా కొనసాగింది. ఆయా చౌరస్తా లలో శాకాహారంపై పిరమిడ్ మాస్టర్లు ప్రజలకు అవగాహన కల్పించారు. మహిళా మాస్టర్లు బతుకమ్మ ఆడుతూ అలరించారు. ఈ సం దర్భంగా ఉమ్మడి జిల్లా ప్రధాన పోషకుడు గుప్తా, జిల్లా అధ్యక్షుడు చెన్న కేశవులు మాట్లాడుతూ మాం సాహారం తినడం వల్ల అనారోగ్యం బారిన పడుతా మన్నారు. శాకాహారం మానవహారం అన్నారు. దీం తో సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ప్రతి రోజూ ధ్యానం చేయడం వల్ల రోగాలు దరి చేరవ న్నారు. ర్యాలీకి మహబూబ్నగర్, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణ పేట, నాగర్ కర్నూల్ జిల్లాల నుంచి మాస్టర్లు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమంలో సెక్రటరీ ప్రవీణ్, కోశాధికారి సత్యనారాయణ రాజు, బంగ్లా ఆంజ నేయరెడ్డి, శ్రీపాల్ రెడ్డి, గౌరవ సలహాదారుడు వీరఘశం, నరెందర్, శారద, మౌనిక, సూర్య ప్రకాశ్, నవీన్, తదితరులు పాల్గొన్నారు.