Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్నికలప్పుడు రాజకీయం చేద్దాం
- ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి
నవతెలంగాణ- కొత్తకోట
పార్టీలకతీతంగా పట్టణాలను, పల్లెలను అభివృద్ధి చేసుకుందామని అందు కు అందరూ ముందుకు రావాలని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో 2 కోట్లతో నిర్మించనున్న డ్రైనేజీకి పనులకు జడ్పీ ఛైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డితో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికలొచ్చినప్పుడు రాజకీయం చేద్దాం అప్పటిదాకా అభివృద్ధికి సహకరించాలని అన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీని ఐటి శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో 20 కోట్లు నిధులు తీసుకురావడం జరిగిందని దాని ద్వారా కొత్తకోట మున్సిపాలిటీ కొత్త హంగులతో రూపుదిద్దుకుంటుందని అన్నారు. దీనిని ఓర్వలేక ప్రతిపక్ష నాయ కులు గగ్గోలు పెడుతూ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నిధులు సరిపోవడం లేదు అని మున్సిపల్ చైర్మన్ సుఖేసిని విశ్వేశ్వర్ విజ్ఞప్తి మే రకు మరో 20 కోట్లు నిధులు కావాలని మంత్రి కేటీఆర్‌ను కోరినట్లు చెప్పారు.
కొత్తకోట మండలంలోని కానాయపల్లి గ్రామానికి చెందిన మన్నెం, చందన, ముమ్మలపల్లి గ్రామానికి చెందిన మన్యంకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేషవ రెడ్డి, వైస్ ఎంపీపీ వడ్డే శ్రీని వాసులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.