Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్
నవతెలంగాణ- కృష్ణ
రాహుల్ గాంధీ చేపట్టిన కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర ఈనెల 24న తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుందని మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ అన్నారు. ఆదివారం కృష్ణ మండలంలో గుడేబల్లూరు గ్రామ జాతీయ రహదారి 167 టైరోడ్ వద్ద రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రదేశాలను రాష్ట్ర నాయకులు పరి శీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ యాత్ర తెలంగాణలోకి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఇక్కడికి చేరుకుంటుందన్నారు. ఈ సందర్భంగా కల్పించాల్సిన సదుపాయాలు, ఏర్పాట్లను పరిశీలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షు లు శివసేన రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బి.నర్సింలు, మక్తల్ టౌన్ ప్రెసిడెంట్ తులసిరాజ్, మండల కాంగ్రెస్ అధ్య క్షులు రాజప్ప గౌడ్, మండల యూత్ ప్రెసిడెంట్ పల్లె సురేష్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.