Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వనపర్తి జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి
నవతెలంగాణ- వనపర్తి టౌన్
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి రోగాలు దరి చేరవని జడ్పీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి అన్నారు. వనపర్తి మున్సిపాలిటీలోని గాంధీనగర్ ఏరి యాలో ఆదివారం 10:00 గ0.10 ని'' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ పరిసరాలు పరిశుభ్రంగా ఉం చుకోవాలి, ఇండ్ల దగ్గర ఉన్న వాటర్ ట్యాంకులలో బ్లీచింగ్ పౌడర్ పిచికారి చేయడం చుట్టుపక్కల ఉన్న వారితో పరిసరాలు పరిశుభ్రంగా చేయాలని ఆయన కోరారు. కలుషిత నీటి వల్ల మలేరియా జ్వరాలు వస్తాయని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, , మున్సి పల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, వార్డ్ కౌన్సిలర్లు, మున్సిపల్ కమిషనర్ విక్రం సింహారెడ్డి మున్సిపల్ ఉద్యోగులు, మెప్మా ఉద్యోగులు, రిసోర్స్ పర్సన్స్, మహి ళా సంఘాల సభ్యులు , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు: పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొమ్మిదవ వార్డులో నిలువ నీటిని పారబోసి కాలువలను శుభ్రం చేసి దోమల నివారణ మందు పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రి రవికుమార్ , వైస్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, ఇన్చార్జి కమిషనర్ వెంకటేశ్వర్లు, కౌన్సిలర్ మడ్ల రామకృష్ణ, యాదమ్మ, కోఆప్షన్ సభ్యులు రియాజ్ అలీ, మహిళా సమైక్య సభ్యులు, ఆశా కార్యకర్తలు మున్సిపల్ సిబ్బంది ,వార్డు ప్రజలు పాల్గొన్నారు.