Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన ఆశయ సాధన కోసం కృషి చేద్దాం
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.రాములు,
- సీనియర్ నాయకులు కిల్లె గోపాల్
- ఘనంగా నివాళి అర్పించిన నాయకులు
నవతెలంగాణ- మహబూబ్ నగర్
సీపీఐ(ఎం) పొలిట్ బ్యూరో సభ్యులు, కేరళ మాజీ మంత్రి కొడియేరి బాలకృష్ణ మృతి పార్టీకి తీరని లోటని పార్టీ జిల్లా కార్యదర్శి ఏ రాములు, సీనియర్ నాయకులు కిల్లె గోపాల్ అన్నారు. ఆది వారం మహబూబ్నగర్ జిల్లా పార్టీ కార్యాలయంలో కొడియేరు చిత్రపటానికి పార్టీ నాయకులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలకృష్ణ కమ్యూ నిస్టు పార్టీ విలువలు సిద్ధాంతాలను చివరి వరకు పాటించిన గొప్ప నాయకుడని గుర్తు చేశారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా పార్టీలో పొలిట్ బ్యూరో సభ్యుడిగా కీలక బాధ్యతలు నిర్వహించారని అన్నారు. ఆయన కొంతకాలంగా క్యాన్సర్తో బాధప డుతూ శనివారం తుది శ్వాస విడిచారని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక లౌకిక కమ్యూనిస్టు విలు వలు ఆయనను చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి నల్లవెల్లి కురుమూర్తి నాయకులు పద్మ , విష్ణు, సురేష్ సత్యం తదితరులు పాల్గొన్నారు.
కందనూలు: బాలకృష్ణన్ మృతి సిపిఎం పార్టీకి తీరని లోటు అని ఆయన ఆశయాలను కొనసా గిస్తామని సీపీఎం జిల్లా కార్యదర్శి పర్వతాలు అన్నా రు. ఆదివారం ఆయన చిత్రపటానికి పూల మాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్ననాటి నుండే వామపక్ష ఉద్యమాలకు ఆకర్షితులై ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్య దర్శిగా, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శిగా , కేరళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా, పోలిట్ బ్యూరో సభ్యునిగా పని చేశారన్నారు. బాలకృష్ణన్ మృతి దేశంలో వామపక్ష ప్రజా పోరాటాలకు తీరని లోటు అన్నారు. రైతాంగ ఉద్యమంలో అనేక సంవత్సరాలు పనిచేశారని అన్నా రు. ఆయన మృతికి సిపిఎం నాగర్ కర్నూల్ జిల్లా కమిటీ సంతాపాన్ని ప్రకటిస్తున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి అశోక్, నాయకులు కాశన్న, సత్యనారాయణ, నరసింహ, చంద్రయ్య, సురేష్,లింగం తదితరులు పాల్గొన్నారు.
వనపర్తి : కొడియేరి బాలకృష్ణ మరణం పార్టీకి తీరనిలోటని సీపీఎం వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం డి జబ్బార్ అన్నారు. కొడియేరి బాలకృష్ణ మరణానికి సంతాపంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని పార్టీ జెండా అవనతం చేసి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా జబ్బార్ మాట్లాడుతూ కోడియేరి బాలకృష్ణన్ మృతి పై పార్టీ జిల్లా కమిటీ తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలి యజేస్తున్నామన్నారు. కొడియేరి ప్రజల కోసం శ్రమించే పోరాట యోధుడు అని పేర్కొన్నారు. దోపిడీి లేని భారత సమాజం కోసం సామాజిక పరి వర్తన కోసం అవిశ్రాంతంగా కృషి చేశారని కొని యాడారు. ఆయన మరణం సిపిఐఎం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు తీరని లోటని అన్నారు. కార్యక్ర మంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పుట్ట ఆంజనేయులు, జిల్లా కమిటీ సభ్యులు గోపాలకృష్ణ, మండ్లరాజు, టౌన్ నాయకులు గట్టన్న, మహేష్ రాజశేఖర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.