Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి
నవతెలంగాణ- మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తన నివాసంలో నవతెలంగా ణతో మాట్లాడుతూ నియోజకవర్గంలో ఏలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పనులు పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాయకులు నేల విడిచి సాము చేయకుండా ప్రజలకు ఏవి అవసర మో నిర్దిష్టంగా ఆ పనులు చేసి పెడితే వారి గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా రన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే మాకు శ్రీరామరక్ష అని ఆయన ధీóమా వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో 40 శాతం కుటుంబాలకు పైగా నేరుగా లబ్ధిపొందారని అన్నారు. కల్యాణ లక్ష్మి రైతుబంధు బీమా సీఎం రిలీఫ్ ఫండ్ ఎల్ఓసి తోపాటు పింఛన్లు గ్రామాల్లో మౌలిక వసతుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో కృషి చేస్తున్నదని ఆయన అన్నారు. ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళుతున్నదని పక్షాలు విమర్శ లకే పరిమితం కాకుండా అభివృద్ధిని చూడాలని ఆయన గుర్తు చేశారు. జిల్లాలో నిర్మించిన చెక్ డ్యాములు సీసీ రోడ్లు మురుగు కాలువల నిర్వహణ తోపాటు స్మశాన వాటికలు రైతు వేదికలు డంపింగ్ యార్డులు గ్రామాలలో క్రీడల స్థలా లు ఆల్టోరియం నాగర్‌కర్నూల్ పట్టణ సుందరీ కరణ ట్యాంక్‌బండ్ నిర్మాణం తది తర అనేక విషయాలలో అభివృద్ధిలో ముందువరుసలో ఉన్నామని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని మాట్లాడినా ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారని ఆయ న ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ ఈశ్వరయ్య మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి నువ్వు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సహకారంతో చిన్న వాగులో నిర్మించిన బ్రిడ్జి వల్ల రైతులకు ప్రయాణికులకు చాలా ఉపయోగకరంగా మారిందని గుర్తు చేశారు. వర్షాలు వస్తే గ్రామం నుం డి బయటికి వెళ్లి వారం కాదని ఒక్కోసారి 15 రోజులు వర్షాలతో చుట్టూ వాగు ల వల్ల ఆహారానికి సైతం కరువైన పరిస్థితులు నెలకొని ఉండేవని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితులు లేవని ఎమ్మెల్యే గారికి అభినందనలు తెలిపారు.