Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
నవతెలంగాణ-పదర
నల్లమల లోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో కృష్ణా నదిపై వంతెన నిర్మాణమే తన లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన దుర్గామాత ఉత్సవాలు, బతుక మ్మ పండుగకు ఆయన సతీమణి అమలతో కలిసి పాల్గొన్నారు. అనంతరం దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేసి ఎమ్మెల్యే మాట్లాడుతూ చెన్నకేశవ ప్రాజెక్టు నిర్మాణంతో అమ్రాబాద్, పదర మండలాలను సాగు నీరుతో సస్యశ్యామలం చేస్తానన్నారు. ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ కృష్ణ నదిపై వంతెన నిర్మా ణం కోసం అనేకమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, సోమశిల మాదిరిగా కృష్ణానదిపై వంత నిర్మాణం చేపట్టే వరకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. అనంతరం మండల కేంద్రంలోని పబ్బతి ఆంజనేయస్వామి నూ తన ఫిల్లింగ్ స్టేషన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అచ్చంపేట మున్సి పల్ చైర్మన్ నరసింహ గౌడ్, జిల్లా టిఆర్ఎస్ నాయకులు ఎర్ర నరసింహ, జడ్పి టిసి రాంబాబు, మద్దిమడుగు ఆలయ చైర్మన్ విష్ణుమూర్తి, రాజేశ్వర్ రెడ్డి, సింగ ల్ విండో డైరెక్టర్ రమేష్ , శంకర్ ,పదర మండల అధ్యక్షుడు ఎడమ జగపతి రాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోలి శ్రీనివాసులు, ముత్యాలు,ఎడమ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.