Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్రాక్టర్ల ఈఎంఐలు, కరెంట్ బిల్లులు కట్టేందుకు గ్రామ పంచాయతీల ఇక్కట్లు
- పంచాయతీ కార్యదర్శులను బాధ్యులను చేస్తున్న ఉన్నతాధికారులు
- నాగర్‌కర్నూల్ జిల్లాలో 36 మందిని సస్పెండ్ చేసిన కలెక్టర్
- నిధులు లేకుండా నిర్వహణ ఎలా అని కార్యదర్శులు ఆందోళన
- తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని ప్రజాసంఘాల డిమాండ్
నవతెలంగాణ -మహబూబ్‌నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో 1650 గ్రామ పంచాయతీలు 2675 ఆవాసాలు ఉన్నాయి. గ్రామపం చాయతీల్లో వీధిలైట్లు, మోటార్ల నిర్వహణ, పంచాయతీ విద్యుత్ బిల్లులను గతంలో ప్రభుత్వమే చెల్లించేది. తెలం గాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం చెత్త సేకరణ, నీటి సరఫరా కోసం పంచాయతీలు ట్రాక్టర్లను కొనుగోలు చేయాలంటూ ఆదేశించింది. దీంతో ట్రాక్టర్ నిర్వహణతో పాటు డ్రైవర్ జీతాలు పంచాయతీలకు పెను భారంగా మా రింది. అష్టకష్టాలు పడి అప్పులు చేసి ఈఎం ఐలు, విద్యుత్ బిల్లు చెల్లిస్తున్న సర్పంచ్‌లు, కార్యదర్శులను ప్రశంసిం చాల్సిన ప్రభుత్వం వారిని సస్పెండ్ చేస్తోంది.
పంచాయతీలకు సంబంధించి కరెంట్ బిల్లులు, ట్రాక్టర్ల ఈఎంఐ లు సకాలంలో చెల్లించలేదన్న కారణంగా 36 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శులను సస్పెం డ్ చేస్తూ గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన వారిలో అచ్చం పేట మండలం సిద్ధాపూర్‌కు చెందిన భీముడు, అమ్రాబాద్ మండలం కుమ్మరోనిపల్లికి చెందిన సంధ్యారాణి, సార్లపల్లి కి చెందిన సూర్య నాయక్, బిజినపల్లి మండలం గంగారం కు చెందిన నరేందర్ రెడ్డి, కారుకొండ పంచాయతీ కార్య దర్శి పద్మ, కార్కొండ తండా పర్వతాలు, లట్టుపల్లి సురేష్, లింగసానిపల్లి ప్రసన్న, మంగనూర్ చంద్రశేఖర్, మీత్య తాండ పర్వీన్ బేగం, పాలెం వెన్సి వినీల, వెంకటాపూర్ వినీల, చారకొండ మండలం గైరాన్ తండా శ్రీను, రామ చంద్రపురం పవన్ కుమార్ నాయక్, సిరిసనుగండ్ల మహే ష్ కుమార్, తిమ్మాయపల్లి కష్ణయ్య, శాంతి గూడెం గణేష్, కల్వకుర్తి మండలం రఘుపతి పేట వంశీ గౌడ్ ను, కోడేరు మండలం బాబాయిపల్లి మహేష్, జనంపల్లి అర్జునయ్య, కోడేరు రవితేజ, మాచుపల్లి శిల్ప, నాగులపల్లి తాండ ప్రదీప్ కుమార్, నాదియా నాయక్ దండ శ్రీనివాసులు సిం గాయిపల్లి వెంకటేష్, తుర్క దిన్నే మల్లేష్, కొల్లాపూర్ మండలం అమరగిరి బుచ్చయ్య ఉన్నారు.
ఒకవైపు గ్రామపంచాయతీలను దేశంలోనే ఉత్తమ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దాలంటూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేయ కున్నా గ్రామాల అభివృ ద్దే లక్ష్యంగా అప్పులు చేసి పనులు చేస్తూ ముందుకు సాగుతున్న సర్పంచులపై ప్రభు త్వం వివక్ష కనబరుస్తోం ది. గతంలో స్మశాన వాటి కలు, డంపింగ్ యార్డులు రైతు వేదికల నిర్మా ణంలో వెనకబడ్డారని 12 మంది సర్పంచు లను సస్పెండ్ చేశారు. ఇప్పుడు ట్రాక్టర్ ఈఎంఐ, విద్యుత్ బిల్లులు చెల్లిం చ లేదని పంచాయతీ కార్యదర్శులను విధుల నుండి తొలగించడం ధారుణమని వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. ఎలాంటి నిధు లు కేటాయిం చకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
కుంటుపడుతున్న అభివృద్ధి
నిధులు లేక అనేక గ్రామపంచాయతీలో అభివృద్ధి కుంటుపడుతోంది. గతంలో ఉన్న నిధులే తప్పా ఏమాత్రం పెంచలేదు. నిధులు పెంచకుండా పంచాయతీల నుండి ఈఎంఐ, విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ హుకుం జారీ చేయడం భావ్యం కాదంటున్నారు. నిధులు పెంచి భారం పెడితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదంటున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ, వీధి దీపాల నిర్వహణ పంచాయతీ కార్యదర్శులకు భారంగా మారింది. ముఖ్యంగా మల్టీపర్పస్ గ్రామపంచాయతీ కార్మికుల పేరా కొంత మందిని సిబ్బందిని నియమించుకోవాలని చెప్పారు. నెల నెలా వారి వేతనాలు, ట్రాక్టర్ నిర్వహణ, డ్రైవర్ జీతం, వీధిలైట్లు తదితర ఖర్చులకు డబ్బులు లేక సర్పంచులు తీవ్ర ఒత్తడికి గురవుతున్నారు. తెలకపల్లి మండల కేంద్రం, పెద్దూరు నడిగడ్డ గ్రామపంచాయతీలో పాటు 26 పంచా యతీల్లో నిర్వహణ భారంగా మారి సర్పంచ్‌లు అప్పుల పాలవుతున్నారు. కార్యదర్శులు చేసేదిలేక ప్రజల నుండి చివాట్లు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు అధికంగా మంజూరు చేసి పంచాయతీలను ఆదుకోవాలని, సస్పెండ్ చేసిన పంచాయతీ కార్యదర్శులను విధుల్లోకి తీసు కోవాలని పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కోరుతున్నారు.