Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అలంపూర్: దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జోగులాంబ బాలబ్రహ్మేశ్వరులకు ఆదివారం ప్రభుత్వం తరఫున రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య, ఎమ్మెల్యే అబ్రహం, అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఉన్నారు. వీరికి ఆలయ అర్చకులు ఆలయ కార్యనిర్వహణా ధికారి పురేందర్‌కుమార్, చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డిలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి జోగులాంబ బాలబ్రహ్మేశ్వర ఆలయాలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు దసరా నవరాత్రోత్సవాల సందర్భంగా జోగులాంబ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం అర్చకులు జోగులాంబ బాలబ్రహ్మేశ్వరుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను తిలకించేందుకు యాత్రికులు వివిధ ప్రాంతాల నుంచి పోటెత్తి వచ్చారు. ఏడవ రోజు అమ్మవారు కాళరాత్రిదేవి అలంకారంలో దర్శనమిచ్చారు.