Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ చీరలు పంపిణీలో రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్
నవతెలంగాణ -హన్వాడ
మండలాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తా మని రాష్ట్ర మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మం గళవారం మండలంలోని మంత్రి అన్ని గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కొత్తపేట్, కంకర, బుద్ధారం, పెద్దదర్పల్లి, హన్వాడ, వేపూరు, గుండాల, యారంపల్లి, మాదారం, కొనకట్టపల్లి, ఇబ్రహీంబాద్, నాయనపల్లి, తిరుమలగిరి, ఫుల్ఫోన్ పల్లి గ్రామాల్లో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దసరా పండుగ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆడబిడ్డలకోసం కానుకగా బతుకమ్మ చీరలపంపిణీ చేస్తున్నారన్నారు. పేదవారు కొంత మంది పండుగ కొత్త బట్టలు కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని అందుకు తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డల ను దృష్టిలో ఉంచుకొని చీరల పంపిణీ చేస్తున్నార న్నారు. అంతేకాకుండా హన్వాడ మండలంలో గతంలో పాలించిన ప్రభుత్వాలు ఇవ్వని నిధులు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన ఎనిమిది సంవత్సరా ల్లో అనేక నిధులిచ్చి అభివృద్ధి చేశామన్నారు. 57 సం వత్సరాలు నిండి అర్హులైన అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తున్నామన్నారు. ప్రతి ఆడబిడ్డల పెళ్లికోసం కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ వంటి పథ కాలు ఇచ్చి పేదలకు ఆసరా అయ్యామన్నారు. రైతు లకు దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటలు ఉచిత కరెంటు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం టీఆ ర్ ఎస్ ప్రభుత్వమన్నారు. గ్రామాల్లో సౌకర్య వంత మైన రోడ్లు భవనాలు కార్యాల యాలు నిర్మించా మని అన్నారు. మండలంలో వివిధ ప్రాజెక్టులు తీసుకొ స్తున్నామని చెప్పారు. రిజర్వాయర్ ద్వారా కాల్వలు తీసుకొచ్చి మండలంలో ప్రతి చెరువు నింపి ఎండాకా లంలో అలుగులు పారిస్తామన్నారు. మహబూబ్నగర్ నుంచి తాండూర్ వరకు డబుల్ లైన్ రోడ్లు త్వరలో ప్రారంభిస్తామన్నారు. మండలంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ తీసుకొచ్చి ఎంతోమందికి ఉపాధి కల్పిస్తా మన్నారు. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్ర మాలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. త్వరలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహిస్తామన్నారు. వృద్ధులకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని పరీక్షించి వైద్యసేవలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీ పీ బాలరాజ్ జెడ్పీటీసీ విజయనిర్మల, రమణారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెంకటయ్య, వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు కరుణాకర్ గౌడ్, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.