Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ- కందనూలు
యువకులు క్రీడల్లో రానిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సెక్రటరీ డాక్టర్ సోలాపూర్ స్వాములు అన్నారు. ఈనెల 7,8 తేదీలలో హన్మకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించే తెలంగాణ స్టేట్ అథ్లెటిక్స్ సీనియర్ మెన్, ఉమెన్ జిల్లా ఎంపికలను మంగ ళవారం అచ్చంపేట పట్టణంలోని సాం ఘిక సంక్షేమ గురుకుల మైదా నంలో నిర్వహించారు. ఈ క్రీడాపోటీల్లో వంద మంది క్రీడాకారులు పాల్గొని వివిధ త మ ప్రతిభను చాటారు. ఈ సం దర్భం గా డాక్టర్ స్వాములు మాట్లాడు తూ.... క్రీడలు మానసిక ఆరోగ్యానికి దోహ దపడతాయని, యువకులు క్రీడల్లో రాణించడం ద్వారా క్రీడా కోట కింద ఉన్నత ఉద్యోగాలు సాధించవచ్చని తెలిపారు. క్రీడాకారులు ప్రతిరోజు సాధన చేస్తూ జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని కోరారు. క్రీడల్లో మంచి ప్ర తిభ కనబరిచిన వారికి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఎల్లప్పుడూ అండగా ఉం టుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రెటరీ పరుశురాముడు, కో-శాదికారి శ్రీను యాదవ్, అథ్లెటిక్స్ కోచ్ బిక్షపతి యాదవ్,జగపతి రాజు, కర్నాటి శ్రీను, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.