Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి కే రాఘవ
నవతెలంగాణ-ఆత్మకూర్
పట్టణంలోని శ్రీనివాస కాలనీలో మంగళవారం ఎస్ఎఫ్ఐ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహాయ కార్యదర్శి కే రా ఘవ హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధ్యాయ నం, పోరాటం, నినాదంతో స్వాతంత్ర ప్రజాస్వామ్యం, సోషలిజం సాధించే దిశగా విద్యార్థి పోరాటాలు ఉండాలని అన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిన విద్యాసంస్థల సమస్యలు తీరడం లేదన్నారు. రాబోయే కా లంలో సంఘటితంగా విద్యార్థి పోరాటాలు వర్ధిల్లాలని పేర్కొన్నారు. అనం తరం ఎస్ఎఫ్ఐ పట్టణ నూతన కమిటీ ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రణ రు, ఉపాధ్యక్షుడిగా రోహిత్, అరవింద సహాయ కార్యదర్శిగా దుర్గాప్ర సాద్, కమిటీ సభ్యుడిగా అనిల్, మస్తాన్, సాయికిరణ్, శివ రంజిత్లను ఎన్నుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.