Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -హన్వాడ
మండలంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి జెండావిష్కరణ మంగళవారం మండలాధ్యక్షుడు టంకర రాములు ఆవిష్కరించా రు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మయ్య హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవీపీఎస్ ప్రారం భించి 24 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జెండాను ఆవిష్కరించడం సంతోషకరమన్నారు గడిచిన 24 సంవత్సరాలలో సమస్యలపై అనేక పోరాటాలు చేసి అనేక విజయాలు సాధించామన్నారు. రాబోయే కాలంలో అంతటానితనం కుల వివక్షపై పోరాడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు. దళిత హక్కులపై పోరాడేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కుల వివక్ష అంటరానితనంపై ప్రతినెల 31న పౌర హక్కుల దినంగా పాటించి గ్రామాల్లో అధికారులు చైతన్యం తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కెేవీపీిఎస్ జిల్లా కార్యదర్శి ఎం. కురుమ య్య మండల కార్యదర్శి మొగులయ్య ఎమ్మార్పీఎస్ నాయకులు బుక్కి రాములు తోపాటు పలువురు పాల్గొన్నారు.