Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి
- అన్ని రంగాలు వ్యవసాయ ఆర్థిక అభివృద్ధిపైనే ఆధారం
- వైభవంగా మంత్రి పుట్టిన రోజు వేడుకలు
- శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు
నవతెలంగాణ- వనపర్తి
రైతులు ఆనందంగా ఉంటే సమాజం బాగున్నట్లేనని, వ్యవసాయం బాగుంటే ప్రజలందరూ బాగుపడతారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. గోపాల్పేట మండలం చాకల్‌పల్లి శివారులో డీ-8పై నిర్మించిన మైనర్ 5 కాలువ నుండి సాగునీటిని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మంగళవారం విడుదల చేశారు. అనంతరం రైతులతో కలిసి సహఫంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అన్ని రంగాలు వ్యవసాయ ఆర్థిక అభివృద్ధి మీద ఆధారపడే జీవిస్తాయన్నారు. వివిధ వృత్తులు, ఉపాధి, వ్యవసాయం బాగుంటేనే అభివృద్ది చెందుతాయని అభిప్రాయపడ్డారు. గత ఎనిమిదేళ్లలో మారిన గ్రామాల రూపురేఖలే దానికి నిదర్శనమన్నారు. సాగు నీరు అందని మిట్టప్రాంతాల రైతుల సమస్యలు దృష్టికి రాగానే సాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. వివిధ వ్యవసాయం బాగుంటేనే అభివృద్ది చెందుతాయన్నారు. కృష్ణా నీటిని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. వర్షాలు ప్రారంభమైన ప్రతిసారీ ముఖ్యమంత్రి కేసీఆర్ మమ్మల్ని అప్రమత్తం చేస్తారన్నారు. చెరువులు, కుంటలను ఎప్పటికప్పుడు నిండుగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నా మన్నారు. దీనిమూలంగా భూగర్భ జలాలు పెరుగుతా యన్నారు. గత ఏడేళ్ల ప్రయత్నం మూలంగా రాష్ట్రంలోనే వనపర్తి జిల్లాలో భూగర్భ జలాలు అత్యధికంగా పెరిగా యన్నారు. నీటి ఆయకట్టును పెంచేందుకు నిరంతర ప్రయ త్నాలు అసంపూర్తి పనులన్నీ సరిచేస్తున్నా మన్నారు. డీ-8 కాలువపై మైనర్ 5 కాలువ నుండి గోపాల్పేట, ఎర్రగట్టు తండాకు నీటి విడుదల శారు. రైతుల కోరిక మేరకు కొత్త కాలువతో 300 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. పుట్టినరోజు నాడు రైతులకు సాగునీరు అందించే కాల్వను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. సాగునీటిని సద్వినియోగం చేసుకోవడంలో రైతులలో అవగాహన పెరిగిందన్నారు. పంటల మార్పిడి, ఆధునిక వ్యవసాయ పద్ధతులను అవలం భించడంపై రైతులు అవగాహన పెంచు కోవాలన్నారు. రాబోయే కాలానికి అవసరమైన పంటలు పండించడంపై రైతు వేదికల ద్వారా రైతులను చైతన్యం చేస్తున్నామన్నారు. తెలంగాణలో పని సంస్క తి పెరిగిందని మంత్రి చెప్పారు. దళితబంధు పథకం కింద మంజూరైన కారును లబ్ధిదారుడు ప్రేమ్‌కు అందజేశారు. మంత్రి పుట్టినరోజు సందర్భంగా స్వగృహంలో మాతమూర్తి సింగిరెడ్డి తారకమ్మ చిత్రపటానికి మంత్రి నివాళులు అర్పించారు. అంతకుముందు వనపర్తి మం డలం అంజనగిరిలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఆశీస్సులు అందుకుని, ఇటీవల మరణించిన పార్టీ కార్యకర్త రఘుపతి సతీమణి ఆనందమ్మకు పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
మంత్రికి శుభాకాంక్షలు , ప్రముఖులు, రక్తదానం
మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రికి పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి మాజీ ఎంపీ మందా జగన్నాధం, మహబూబ్ నగర్ జడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి, జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ రంజన్ రతన్ కుమార్ తదితరులు మంత్రిని కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ వనపర్తి క్యాంపు కార్యాలయంలో మంత్రి నిరంజన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్ పటేల్ విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో తరలివచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు గజమాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి పుట్టినరోజు సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల సెంట్రల్ ఫోరం ఆధ్వర్యంలో ఫోరం అధ్యక్షులు చిలుక నర్సింహారెడ్డి, కార్యదర్శి ముక్రం, అసోసియేట్ ప్రెసిడెంట్ వెంకటేశం, కోశాధికారి శేఖర్, హబీబ్, శ్రీశైలం, అశ్వక్ హాస్టల్ విద్యార్థుల కోసం వంద బెడ్ షీట్లు అందజేశారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. గత ఎనిమిదేళ్లలో వనపర్తి అభివృద్ధిపౖౖె రూపొందించిన డాక్యుమెంటరీ టీజర్‌ను మంత్రి విడుదల చేశారు. భాగ్యనగర్ పోస్ట్ మాసపత్రిక రూపొందించిన ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఎడిటర్ మల్యాల వీర రాఘవరెడ్డి, ప్రముఖ కవులు కోట్ల వెంకటేశ్వర్ రెడ్డి, వనపట్ల సుబ్బయ్య పాల్గొన్నారు.ఈ కార్యక్రమాల్లో వనపర్తి జెడ్పీ చైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పాల్గొన్నారు.