Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పండగ ఎదైనా కొత్త బట్టలు పప్పులు, నూనె, పిండి వంటివాటిని కొనుగోలు చేస్తుంటారు.ప్రధానంగా చెక్కర, నూనె వంటి వాటిని చౌక దుఖానాల ద్వారా ప్రభుత్వమే సరఫరా చేసేది. ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర ధరలు మరోవైపు ప్రభుత్వం చౌకధర దుఖానాల ద్వార సరఫరాను నిలిపివేతతో ప్రజలు పండుగలు అంటేనే బెంబేలెత్తిపోతున్నారు.పండగలను వేదికగా చేసుకొని పార్టీలు ముందస్తు ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేసుకుంటున్నారు.పండుగల ముందు ధరలను తగ్గించాల్సిన పాలకులు ఆదిశగా పనిచేయడం లేదు. ఎన్నికల ఎజెండాను ముందు వేసుకొని నాయకులు నేల విడిచి సాము చేస్తున్నారని పలువురు విమర్శలు చేస్తున్నారు.
- పండగలకు సరుకులు కరువు
- దసర ఉత్సవాలు... ముందస్తు రాగాలు
- ఎన్నికలు ఎప్పుడొచ్చినా సిద్ధమంటున్న పార్టీలు
- నాయకులు ప్రసంగాలన్నీ ఎన్నికల కోసమే
- నేల విడిచి సాముచేస్తున్న పార్టీలు
నవతెలంగాణ-మహబూబ్‌నగర్ ప్రాంతీయప్రతినిధి
ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీల కటౌట్లతో పట్టణాలు, కూడళ్లు నిండిపోయాయి. ఉత్సవాలు చూస్తుంటే ఎన్నికల వాతావరణం చోటు చేసుకున్నట్లు ఉంది. చిన్న సెమినార్లు మొదలుకొని బహిరంగ సభల దాక ఓట్ల రాజకీయాలు తప్ప వేరే ఉపన్యాసాలే లేవు.ఇచ్చిన వాగ్థానాల గురించి ఎవ్వరూ.. మాట్లాడటం లేదు. రాష్ట్రంలో ముందస్తు ఊహాగానాలు వస్తుండటంతో అందుకు అనుగుణంగానే ఇక్కడ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రజా సమస్యలనూ ఎజెండా చేసి ఎవ్వరూ... మట్లాడటం లేదు. దసరా ఉత్సవాలతో పాటు దీపావలి పండగ మరో 20 రోజుల్లో రాబోతుంది. పండగల సమయంలో పిండివంటలకు ప్రాధాన్యత ఉంటుంది. పండగలకు సంబంచిన నూనె, పిండి, చెక్కెర వంటి వాటితో పాటు 9 సరుకులు గతంలో చౌకధర దుఖానాల ద్వారా సరఫరా చేసేవారు. ఇప్పుడు బియ్యం తప్ప ఏవీ సరఫరా చేయడం లేదు. దీంతో మార్కెట్లో అధిక ధరలకు కొనుగోలు చేయాల్సిన దుస్తితి ఏర్పడింది. ఇక కొత్త బట్టలు, పండగకు సంబందించిన కూరగాయాలను, పండ్లు, పూలు తధితర ఏ వస్తువు కొనాలన్నా... ధరలు మండిపోతున్నాయి. నిత్యవసర వస్తువులను సరఫరా చేసి పేదలను ఆదుకోవాలని పలు పార్టీలు సంఘాలు కోరుతున్నాయి.
ఎన్నికల మీదనే ద్యాసంత
ఉమ్మడి జిల్లాలో అప్పడే ఎన్నికల వాతావరణం ఏర్పడింది. ఎక్కడ చూసినా ముందస్తు చర్చనే సాగుతోంది. సోషల్‌మీడియాలో కేబినెట్ రద్ధు చేస్తారని రావడంతో ఊహాగానాలకు మరింత పదును ఏర్పడింది. జాతీయ పార్టీతో పాటు ఎన్నికల్లోకి వెలతారనే చర్చ జరుగుతోంది. అయితే ప్రజలకిచ్చిన వాగ్దానాలను మాత్రం అమలు చేయడం లేదు. ఇప్పటికైనా ఎన్నికల ద్యాస మరిచి పండగలకు తక్కువ ధరలకు చౌకధర దుకానాల ద్వారా సరుకులు సరఫరా చేయడంతో పాటు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని కోరుతున్నారు.
నాకు తోచిన సహాయం చేస్తున్నాం
నేను కొన్ని గ్రామాలలో ప్రజల కష్టాలు చూశాను. ప్రభుత్వ రంగాలు సైతం డబ్బులు లేక పనులు చేయడం లేదు. నాకు తోచిన సహాయం చేస్తున్నాం. డబ్బుల సందర్బంగా పాలకలు చౌకదర దుఖానాల ద్వారా బియ్యంతో పాటు నూనె, చెక్కెర పప్పు, చింతపండు తదితర వస్తువులు అందజేయాలి. లేనిచో పండగల పూట ప్రజలు పస్తులు ఉండాల్సి వస్తోంది. దసరాతో పాటు దీపావళిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సంబరాలు వదలి పేదల సమస్యలను పట్టించుకోవాలి. వారికి కనీస తిండిగింజలు అందేలా చర్యలు తీసుకోవాలి.
- రాఘవేందర్‌రెడ్డి,
ఐక్యత పౌండేషన్ అధినేత, కల్వకుర్తి