Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : వీఆర్ఏ జేఏసీ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కేందంలో చేపట్టిన వీఆర్ఏల నిరవధిక సమ్మె మంగళ వారానికి 72వ రోజుకు చేరుకుంది. ప్రభు త్వం తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. పే స్కేల్ జీవో అమలు చేయాలని కోరారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు ఇవ్వాల న్నారు. 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు ఉదో ్యగాలు ఇవ్వాలన్నారు. పై డిమాండ్లను సీఎం వెంటనే నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జెఏసీ వనపర్తి మండల అధ్యక్షుడు రమేష్, మండలంలోని వీఆర్ఏలు పాల్గొన్నారు.