Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధరూర్
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట పేస్కేల్ అమలు చేయడంతో పాటు పదోన్నతులు కల్పించాలంటూ వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం 72వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా రెవెన్యూ సహాయకులు మాట్లాడుతూ విజయదశమి రోజైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేరు స్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడిలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు మమ్మల్ని చర్చలకు పిలిచినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశా రు. ఇప్పట్టికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాం డ్లను ఒప్పుకొని పండుగ రోజు సంతోషకరమైన ప్రకటన చేయాలని కోరారు. లేకుంటే డిమాండ్లను అమలు చేసే వరకు సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రెవెన్యూ సహాయకులు పాల్గొన్నారు.
నిత్యవసర సరుకుల పంపిణీ
చిన్నంబావి: మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ఎదుట రిలే దీక్షలు కొనసాగిస్తున్న వీఆర్ఏలకు మంగళవారం కొల్లాపూర్ ఎంపీపీ గాదేల సుధారాణి నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వీఆర్ లకు రెండు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నారని దసరా పండుగను పురస్కరించు కొని 40 మంది వీఆర్ఏలకు నిత్యావసర సరుకులు అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కేసిరెడ్డి చిన్నారెడ్డి, వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.