Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సొంత భవనాలకు నోచుకోని అంగన్వాడీలు
- అద్దె, సామూహిక భనాల్లో కొనసాగింపు
- ఇబ్బందులు పడుతున్న టీచర్లు, పిల్లలు
నవతెలంగాణ-ఆత్మకూరు
ఆత్మకూరు మండల పరిధిలో 35 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా అం దులో కేవలం ఏడింటికి మాత్రమే సొంత భవనాలు ఉండగా 10 కేంద్రాలు అద్దె భవనాల్లో మిగితా వి సాముహిక భవనాల్లో కొనసా గుతున్నట్లు ఆత్మకూరు ప్రాజెక్టు అధికారుల నివేధిక ద్వారా తెలు స్తోంది. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల్లో సరియైన వసతులు లేక కేంద్ర నిర్వాహకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అద్దె భవనాలు మార్చిన ప్పుడల్లా సర కులు తీసు కెళ్లడానికి తీవ్ర ఇబ్బందు లు పడుతున్నామని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలోనే అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిం చాలని సూచించడంతో పాఠశాలలో కూడా గదులు లేకపోవడంతో కొన్ని గ్రామాలలో సామూహిక భవ నాలలో, అద్దె భవనాల్లో నిర్వహిస్తు న్నా భవనాలు నిర్వాహకులు, యజమానుల నుంచి ఇబ్బందులు తప్పడం లేదంటు న్నారు.
కొన్ని గ్రామాలలో ఇదివరకు గ్రామపంచాయతీ వారు స్థలాలను చూపించి భవనాల నిర్మాణానికి తీర్మానా లు పంపినా అవి ఈ బుట్ట దాఖలయ్యాయంటున్నారు. ఇప్పట్టికైనా సంబంధిత, అధికారులు, ప్రజాప్రతి నిధులు చొరువ తీసుకొని అంగన్వాడీలకు సొంత భవనాలు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు చిన్నారుల తల్లిదండ్రులు .
అవకాశం ఉంటేనే...
పాఠశాల భవనాల్లో అంగన్వాడీ కేంద్రాల నిర్వాహ ణపై ఈఓను వివరణ కోరగా పాఠశాలలో గదులు ఉన్నట్ల యితే అంగన్వాడీ కేంద్రాలు నిర్వహించుకోవడానికి అవకా శం ఇవ్వాలనే ఆదేశాలున్నాయన్నారు. గదులు ఉన్న పాఠ శాలల్లో కేంద్రాల నిర్వాహణకు అవకాశం కల్పించామని తెలిపారు.