Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ - వనపర్తి
సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చేసుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ వాహనాలు పంపిణీ చేశారు. అనంతరం మత్స్యకార భవన్ నిర్మాణ స్థలం, ఎస్సీ, బీసీ డిగ్రీ కళాశాల, వ్యవసాయ కళాశాల భవనాల స్థలాలను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎనిమిదేళ్లలో తెలంగాణ పల్లెల స్వరూపం మారిపోయిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామీణ వృత్తి కార్మికులు బలపడ్డారన్నారు. ఉచిత చేప పిల్లలతో మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా నిలదొక్కుకు న్నాయన్నారు. సబ్సిడీ గొర్రెపిల్లలతో గొల్ల కుర్మలు బలపడ్డారన్నారు. కళ్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్ , ఆసరా పథకాలతో మధ్యతరగతి, బలహీనవర్గాలకు భరోసా లభించిందన్నారు. రైతుబంధు, రైతుభీమా, సాగునీరు, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు పథకాలు వ్యవసాయానికి ఊతమిచ్చాయన్నారు. ఒక్కొక్క రంగాన్ని ప్రణాళికాబద్ధంగా తెలంగాణలో అభివృద్ధి చేస్తున్నామన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో తెలంగాణ దేశంలో నెంబర్ వన్ గా నిలిచింది అన్నారు. దేశంలోనే ఏ బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ దరిదాపులలో లేవన్నారు. తెలంగాణలో అమలవుతున్న ఏ పథకాలు బీజేపీ , కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో లేవన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికి దిక్సూచిలా మారుతున్నాయన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ ఆర్ లోకనాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ శ్రీధర్, టిఆర్ఎస్ నాయకులు అధికారులు పాల్గొన్నారు.