Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వీపనగండ్ల
మండల పరిధిలోని గోవర్ధనగిరి గ్రామంలోనిజడ్పీ.హెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం 1993 -2000 సంవత్సరం బ్యాచ్ కి చెందిన ప్రాథమిక ఉన్నత పాఠశాల ఒకటి నుంచి ఏడవ తరగతి విద్యార్థులు చదివిన పాఠశాల విద్యార్థులు శుక్రవారం ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. అప్పట్లో చదువు చెప్పిన ఉపాధ్యాయులు ప్రభాకర్ , రామ్ ప్రసాద్ ,దేవేందర్ ,అప్పటి విద్యావాలంటీర్లు నరసింహారెడ్డి ,వెంకటేశ్వర్ రెడ్డి లను పూర్వ విద్యార్థులు గురువులను పూల మాల శాలువాలతో ఘనంగా సన్మానాలు చేశారు పూర్వ విద్యార్థులు అలనాటి జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు శంకర్ ,రాముడు ,శేఖర్, బాల నారాయణ చారి, గంగ ,రాజు ,మద్దిలేటి, శివుడు ,కల్పన ,మేనక ,భారతి ,గజ్జల అమ్మ తదితరులు పాల్గొన్నారు
పెద్దమందడి : పెద్దమందడి మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మద్దిగట్ల మోజెర్లలో శుక్రవారం 1997-98 పదవ తరగతి చదివిన విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా అప్పటి ఉప్యాధ్యాయులను శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీ నుండి రిటర్మెంట్ తీసుకున్న రామకృష్ణ రెడ్డిని మిత్రబృందం సన్మానించారు. స్కూల్లో చదివిన రోజులను గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, శాంతన్న, పాపన్న, డి.రాములు పూర్వ విద్యార్థులు కిషోర్, చిన్నకేశవలు, అబ్దుల, శివడు, గోపాల్, బాలరాజు,రామకృష్ణారెడ్డి,వెంకటేష్, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, సాయిలు, ఇసుబ్, శ్రీను, రాజేశ్వర్ రెడ్డి,వెంకటేశ్వరమ్మ, పర్జనబేగం, భాగ్యమ్మ, సునీతపాల్గొన్నారు.