Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుగైన వసతులతో ఆలయ అభివృద్ధి
- ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్
నవ తెలంగాణ- అచ్చంపేట రూరల్
ప్రముఖ శీవక్షేత్రం, శ్రీశైలం ఉత్తర ముఖ ద్వారంగా ఖ్యాతిగాంచిన శ్రీ ఉమామహేశ్వర పుణ్య క్షేత్రంలో వాటర్‌ఫాల్స్ కనువిందు చేస్తున్నాయని ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్ శుక్రవారం తెలి పారు. వాటర్ ఫాల్స్ నేపధ్యంలో పాపనాశనంనకు అనుమతి లేదని అన్నారు. క్షేత్రంలో భక్తుల సౌఖర్యార్థం అనేక వసతుల కల్పనలో భాగంగా సేద తీరుటకు గాను రూముల సౌఖర్యము, పార్కింగ్ సదుపాయం, నిరంతరం సీసీ కెమెరాలతో నిఘా పర్యవేక్షణ, నిత్య అన్నదానము ఏర్పాటు, గార్డెనింగ్, నడకదారిలో ఇబ్బందులు ఏర్పడకుండా మార్బల్స్తో ప్లోరింగ్, మెట్ల దారిలో నూతన మెట్లతో మెట్ల దారిని మెరుగుపరచడం వంటి ఆహ్లాదకరంగా, సుందరంగా ఉందన్నారు. ఇతర రాష్ట్రల నుండి భక్తులు, విద్యార్థులు విజ్ఞాన విహార యాత్రలో భాగంగా అధిక సంఖ్యలో పాల్గొంటున్నారని, వారందరికి కూడా నిత్యాన్నదానం ద్వారా ఆకలి తీర్చుస్తున్నారని తెలిపారు.