Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పెద్దమందడి: మండల పరిధి లోని దొడగుం టపల్లి గ్రామం ఊర చెరువుకట్ట తెగిపోయింది. దీంతో ఆయకట్టు పంటలు నీటి మున గడంతో పాటు ఇసుక మేటలు వేసిం ది. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోయారు. చెరువులోని నీరు పోవ డంతో చేపలన్నీ కొట్టుకు పోయి మత్స్యకారులు భారీగా నష్టపోయారు.
నష్టపరిహారం చెల్లించాలి
- మాజీ మంత్రి చిన్నారెడ్డి
తెగిన కట్టను స్థానిక నాయకులతో కలిసి ఏఐసీసీ కార్యదర్శి, మాజీ మంత్రి చిన్నారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం కాకముందే ప్రభుత్వం, అధికారులు బలహీన చెరువులను గుర్తించి మరమ్మతులు చేపట్టి ఉంటే ఇంత భారీ నష్టం జరిగేది కాదన్నారు. చెరువు ఆయ కట్టు కింద 150 ఎకరాలలో వరి పంట మునిగి పోయిందని, వరద నీళ్లు వెళ్లినా తర్వాత పొలాల్లో ఇసుక ను తొలగించడం రైతులకు చాలా ఇబ్బందికరమన్నారు. సకాలంలో చెరువులపై అధికారులు దృష్టి సారించి ముందస్తు చర్యలు తీసుకుని ఉంటే ఇంత నష్టం జరిగేది కాదన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులకు మత్స్యకారులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి, వరి చేనులో పేరుకుపోయిన ఇసుక మెట్ల ప్రభుత్వమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు త్రినాధ్, మాజీ సర్పంచ్ గట్టు మన్నెం, ఎంపిటిసి భార్గవి రాజశేఖర్ శెట్టి, కురుమూర్తి, నరసింహారెడ్డి, రమేష్ నాయక్. వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.