Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిలిచిపోయిన రాక పోకలు
- తెగిన కేఎల్ఐ కాలువ, చెరువు కట్టలు
- దెబ్బతిన్న రోడ్లు, మునిగిన పంటలు
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న అధికారులు
- పంటలను పరిశీలించిన నాయకులు
- నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్
రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా వాగులు పొంగి పొర్లుతు న్నాయి. అనేక గ్రామాల్లోని చెరువులు, కంట కట్టలు తెగడం తో వర్షం నీరంతా వృధాగా పోవడంతో పాటు పోలాల్లోకి నీరు చేరి పంటలు నీట మునిగడంతో పాటు రోడ్లు దెబ్బతి న్నాయి. వాగులు పొంగి పొర్లుతుండడంతో అనేక ప్రాంతా ల్లో రాక పోకలు నిలిచి పోయాయి. దీంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తెగిన కాలువలు, చెరువు కట్టలు, పంటలను వివిధ పార్టీల నాయకలు పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టి పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కొట్టుకుపోయిన బైక్
నవతెలంగాణ - కందనూలు
నాగర్‌కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనూలు నాగసముద్రం చెరువు ఉదృతంగా అలుగు పారుతుండడంతో నాగర్ కర్నూల్ నుండి నాగనూలు, గుడిపల్లి, రేవల్లి, మీదుగా వనపర్తి జిల్లాకు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం రావిపాకుల గ్రామానికి చెందిన అమరేందర్ రెడ్డి ద్విచక్ర వాహనంపై నాగర్‌కర్నూల్ వస్తుండగా నాగనూ లు వద్ద వరద ఉదృతికి బైక్ కొట్టుకపోయింది. అప్రమత్తమైన అమరేందర్‌రెడ్డి వాహనాని విడిచి పెట్టి తప్పించుకొని బయటపడ్డాడు. ప్రమా దకరంగా వాగు పారుతున్నా ఇక్కడ అధికారులు ఎలాంటి హెచ్చరికలు చేయక పోవడంతో ప్రయాణికులు నీటి ప్రవా హం తక్కువగా ఉందని వాగు దాటుతున్నారని దీంతో ప్రమాధాల పడుతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన రాకపోకలు
ఆత్మకూర్: వనపర్తి ఆత్మకూరు వెళ్లే రహదారిలో ఊకచెట్టు వాగు మదనపురం కాజ్‌వేపై నుండి వరదనీరు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాక పోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా అల్లీపురంవద్ద వాగు పారడంతో ఆత్మకూరు నుండి అమ్మాపూర్ మీదుగా మహబూబ్‌నగర్ వెళ్లే వాహనాల రాక పోకలు నిలిచి పోయాయి. పర్దీపూర్ రిజర్వాయర్ అలుగు పారుతుడంతో వడ్డేమాన్ గ్రామ సమీపంలో నిర్మించిన వంతెనపై నీరు రావడంతో వాహనాలు నిలిచిపోయాయి. జిన్నారం దగ్గర మన్నేవాగు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో వాహనాల రాక పోకలు నిలిచిపోయాయి. దీంతో ఆత్మకూరు పట్టణానికి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీట మునిగిన పత్తి పంట
వంగూరు: మండలంలోని పలు గ్రామాల్లో వర్షం నీటితో పత్తి పంటలు నీట మునిగాయి. దీంతో తాము తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ అధికారులు పంటలను పరిశీ లించి ప్రభుత్వం నుంచి పరిహారం వచ్చేలా చూడాలని వారు కోరతున్నారు.
తెగిన రోడ్లు
వంగూరు తుమ్మలపల్లి రోడ్డు వర్షం నీటికి తెగిపోయింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెగిన రోడ్డును జెడ్పిటిసి కెవిన్రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యతా లోపం వల్లనే రోడ్లు తెగిందన్నారు.అధికారులు కాంట్రాక్టర్లు కమిషన్లు కక్కుర్తికి పాల్పడి నాసిక రకంగా రోడ్లు వేయడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడవలసి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా కొండారెడ్డిపల్లి తుమ్మలపల్లి మధ్య తెగిపోయిన రోడ్డును మరమ్మతులు వెంటనే చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.
తెగిన కేఎల్ఐ ప్రధాన కాలువ
కల్వకుర్తి: మండల పరిధిలోని కురుమిద్ద, వెంకటాపూర్ తండా తదితర ప్రాంతాలలో కేఎల్ఐ ప్రధాన కాలువకు గండి పడడంతో వరద నీరు పంట పొలాలను ముంచెత్తింది. దీంతో పత్తి, వరి తదితర పంటలు నీట మునిగి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కేఎల్ఐ ప్రధాన కాలువకు గండి పడే అవకాశం ఉందని వారం రోజుల ముందే కురుమిద్ద గ్రామానికి చెందిన రైతులు అధికారులకు సమాచారం ఇచ్చినా వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దీంతో తాము పంటలు నష్ట పోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సహాయక చర్యలు చేపట్టాలి
- మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్
కేఎల్ఐకాలువలు తెగిపోయిన చోట అధికారులు తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ అన్నారు. శుక్రవారం కుర్మిద్ద సమీపంలో తెగిన కేఎల్ఐ కాల్వను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ ఇలాంటి విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు.
పరిశీలించిన ఇరిగేషన్ డీఈ షర్మిల
కేఎల్ఐ ప్రధాన కాలువలకు గండి పడ్డ విషయం తెలుసుకున్న ఇరిగేషన్ డీఈ షర్మిల కేఎల్ఐ రైతు జేఏసీ అధ్యక్షులు బండెల రామచంద్రారెడ్డి తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వరద ప్రవాహానికి పెద్ద ఎత్తున పంటలు నష్టపోయారని రైతులు ఆమె దృష్టికి తేగా సహాయక చర్యలు చేపడతామని ఆమె రైతులకు హామీ ఇచ్చారు.
కోతకుగురైన రోడ్డు
ఊట్కూర్:మండల పరిధిలోని పులిమామిడి చిన్న పొర్ల గ్రామాల మధ్య ఉన్న రోడ్డు వర్షం నీటి కోతకు గురైంది. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మా రింది. ఎద్దుల బండ్లు, ట్రాక్టర్లపై పొలాలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. వెంటనే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతు పనులు చేపట్టాలని చిన్న పొర్ల గ్రామ సర్పంచ్ మాలి పటే ల్ రవీందర్ రెడ్డి, రెండు గ్రామాల ప్రజలు కోరుతున్నారు
కూలిన ఇండ్లు
చిన్నపొర్ల గ్రామానికి చెందిన కురువ సిద్ధప్ప ఇంటి గోడ , పెద్ద పొర్ల గ్రామానికి చెందిన నర్సమ్మ మట్టి ఇల్లు కూలిపోయింది. దీంతో ఇంట్లోని సామాగ్రి మట్టి పాల య్యాయని ప్రభుత్వం స్పందించి బాధితులను ఆదుకోవా చిన్నపొర్ల సర్పంచ్ మాలి పటేల్ రవీందర్ రెడ్డి, సిపిఐ ఎంఎల్ ప్రజాపంధా జిల్లా నాయకులు పెద్దపొర్ల కనక రాయుడు ప్రభుత్వాన్ని కోరారు.
కుంగుతున్న చెరువుకట్ట
చిన్నపొర్ల గ్రామ చెరువులోకి భారీగా నీరు చేరడంతో కట్టకుంగి నెర్రెలు బారడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్పంచ్, రైతులతో కలసి చెరువు కట్టను పరిశీలించారు. సంబంధిత అధికారులు స్పందించి వెంటనే చెరువు కట్టను పరిశీలించి మరమ్మతులు చేపట్టి పంటలను కాపాడాలని వారు కోరారు.
అప్రమత్తంగా ఉండాలి
- తహసిల్దార్ చంద్రశేఖర్
వెల్డండ: మండలంలోని చెరువులు, కుంటలు ఉపొంగి వాగులు ఉదృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో ప్రజల అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ చంద్రశేఖర్ సూచించారు. ప్రధానంగా బైరాపూర్ సమీపంలో గల వాగు ఉదృతంగా సాగుతునదున ప్రజలు రాకపోకలు మానుకోవాలన్నారు. ప్రజలు వాగువైపు రాకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అదే విందంగా వాగు వద్ద గ్రామ పంచాయతీ సిబ్బందిని నియమించాలని సర్పంచ్ కుమార్‌ను ఆదేశించారు. అలాగే మండల పరిధిలోని బైరాపూర్ కలకొండ గ్రామాలను కలిపి దారిలో వాగులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో చిక్కుకోవడంతో గ్రామస్తులు గమనించి ఆటోను బయటకు తీశారు.
పారుతున్న అలుగులు
బిజినాపల్లి: మండలంలోని పాలెం చెరువు అలుగు పారుతుండడంతో పాలెం గుడ్లనర్వకు రాకపోకలు నిలిచి పోయాయి. అలాగే పాలెం బిజినేపల్లి మధ్యలో వరద పోటెత్తడంతో నాగర్క ర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, హైదారాబాద్ వెళ్లే వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.