Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్
కందనూలు: క్షేత్రస్థాయిలో పోడు భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించి మొబైల్ యాప్ ద్వార అప్లోడ్ చేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్ పంచాయతీ సెక్రెటరీలు, బీట్ ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం అచ్ఛం పేటలోని అటవీ శాఖ కార్యాలయం చౌసిన్హా హాల్లో పోడు భూముల సర్వే పై ఇచ్చిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లా డుతూ బీట్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు ఒక కమిటిగా ఏర్పడి క్షేత్రస్థాయిలో పర్యటించి గిరిజనులు చేసుకుంటున్న పోడు భూములపై సర్వే చేసి నివేదికను మొబైల్ యాప్‌లో నమోదు చేయాలని సూచించారు. ఇప్పటికే మొబైల్లో డౌన్ లోడ్ చేసుకున్న ప్రత్యేకమైన యాప్‌లో ఏ విధమైన సమాచారం ఎలా నింపాలో అవసరమైతే మరో సారి నివృత్తి చేసుకో వా లని తప్పులు చేయవద్దని సూచించారు. ఈ సర్వేను రేపటి నుండే ప్రారంభించాలని ఆదేశించారు. ఇచ్చిన గడువులోగా సర్వే పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారి రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ డీఎఫ్డిఓ నవీన్ రెడ్డి, బీట్ అధికారులు, పంచాయతీ సెక్రెటరీలు తదితరులు పాల్గొన్నారు.