Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొల్లాపూర్ రూరల్
నార్లాపూర్ ముక్కిడి గుండం పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని సీపీఐ(ఎం) ఉమ్మడి జిల్లా నాయకులు నల్లవెల్లి కురుమూర్తి అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లపురం ముక్కిడి గుండం మధ్యలో ఉన్న పెద్దవాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయాలని సీపీఐ(ఎం) పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేశారు. ఈ సందర్భంగా నల్లవెల్లి కురు మూర్తి , పార్టీ మండల కార్యదర్శి బి శివవర్మ మాట్లాడుతూ గత అనేక సంవత్సరాలు నుంచి వర్షాలు వస్తే గ్రామానికి రాకపోకలు నిలిచి పోయని తెలిపారు. ఓట్లు అయి పోయాక మళ్ళీ పలకరించే పరిస్థితి లేదు ఇలా అనేక ఇబ్బందులతో గ్రామ ప్రజలు ఇబ్బం దులు ఎదుర్కొంటున్న నేటికీ ప్రభుత్వ యంత్రాంగం అధికార పార్టీ సరైన దృష్టి పెట్టకపోవడం సరైన పద్ధతి కాదన్నారు ఎప్పటికైనా ప్రభుత్వం దృష్టి పెట్టి గ్రామ ప్రజల యొక్క ఇబ్బందులను పరిష్క రించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు వర్షం వస్తే ద్వీపకల్పం లాక చుట్టూరా నీళ్లు ఉండి మధ్యలో ఊరు ఉన్న పరిస్థితి ఉంద న్నారు. అనేక ప్రమాదాలు జరిగిన పట్టించు కోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. ప్రభుత్వం తక్షణమే బ్రిడ్జి నిర్మాణం చేసి ముక్కిడి గుండం గ్రామ ప్రజల కు రవాణా సౌకర్యం కల్పించాలని తెలిపారు. లేనియెడల సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ప్రజల్ని సమీకరించి బ్రిడ్జి నిర్మాణం అయ్యేంతవరకు పోరాటం నిర్వహిస్తామని వారి సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) ముక్కిడి గుండం శాఖ కార్యదర్శి బి బాలపిరు, గేమ్యా నాయక్ తాండ శాఖ కార్యదర్శి భాస్కర్ నాయక్, నాయకులు భాష నాయక్, రాజు, శీను, వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.