Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం
మహబూబ్ నగర్ కలెక్టరేట్ : భారీ వర్షాలు కురుస్తున్నప్పటికి విధులలో అందుబాటులో లేక పోవడం పట్ల ఇంజనీరింగ్ అధికారులపై మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి,జాతీయ రహదారుల సంస్థ ఈ ఈ, డీఈ ల పై చర్యలకు ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తానని వెల్లడించారు. గురువారం నుండి జిల్లాలో కురుస్తున్న భారీ వంర్షాల నేపథ్యంలో అధికారు లందరు, ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులు జిల్లా యంత్రాంగానికి అందుబాటులో ఉండాలని ఆదేశించి నప్పటికి ఆర్ అండ్బి ,జాతీయ రహ దారుల సంస్థ ఈ ఈ ,డి ఈ లు అందుబాటులో లేకపోవటం, అలాగే గురు వారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో భారీ వర్షాల పై నిర్వహించిన సమీక్ష సమావేశానికి హాజరు కాకపోవడం, శుక్రవారం కూడా అందు బాటులో లేని కారణంగా, ఆర్ అండ్ బి,నేషనల్ హై వే ఈఈ,డిఈల పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు పిర్యాదు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో శుక్రవారం ఉదయమే ఆయన మహబూబ్ నగర్ పట్టణంలోని లోతట్టు ప్రాంతాలలో పర్యటించారు. మహబూబ్ నగర్ పట్టణంలో వర్షపు నీరు సాఫీగా వెళ్లేందుకు అబ్దుల్ ఖాదర్ దర్గా,మేనక థియేటర్ తదితర ప్రాంతాలలో పూడుకుపోయిన కల్వర్టులను తక్షణమే పునరుద్ధరించాలని జాతీయ రహదారుల సంస్థ ఇంజనీర్లను ఆదేశించారు.
పట్టణంలోని నాళాలు, మురికి కాలువలలో చెత్తా,చెదారం అడ్డుపడకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బందిని ఆదేశించారు . గురువారం నుండి కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబ్ నగర్ పట్టణంలోని పెద్ద చెరువు, ఎర్రగుంట అలుగులు పారి రామయ్య బౌలి,బి కె రెడ్డి కాలనీ, శివశక్తి నగర్, తదితర లోతట్టు ప్రాంతాలలోని కొన్ని ఇళ్లలోకి నీరు వస్తున్నందున శుక్రవారం ఉదయాన్నే జిల్లా కలెక్టర్ ప్రత్యక్షంగా ఆయా ప్రాంతాలలో పర్యటించి పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. వర్షం కారణంగా వచ్చే వర్షపు నీరు ఎప్పటికప్పుడు సుల భంగా వెళ్లిపోయెలా ఎప్పటికప్పుడు నాళాలు,మురికి కాలువలు శుభ్రం చేయాలని ,ఎలాంటి చెత్త, చెదారం అడ్డు లేకుండా చూసుకోవాలని ఆదే శించారు. అదేవిధంగా పట్టణంలో రహదారుల విస్తరణ సమయంలో జాతీయ రహదారుల సంస్థ అబ్దుల్ ఖాదర్ దర్గా, మేనక థియేటర్ వద్ద అలాగే థియేటర్ కింది భాగంలో మూడు కల్వర్టులను మూసివేయడం జరిగిందని ,వాటిని తక్షణమే పునరుద్ధరించి వర్షపు నీరు ఎలాంటి అడ్డంకి లేకుండా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీనివల్ల గణేష్ నగర్, వల్లభ్ నగర్ ,గోల్ మజీద్ ,పాత పాలమూరు తదితర ప్రాంతాలలో నీరు నిలిచిపోకుండా నేరుగా ఎర్ర గుంట నుండి ఇమామ్ సాబ్ కుంటకు వెళ్ళేందుకు సులభంగా ఉంటుందని అన్నారు. తర్వాత జాతీయ రహదారుల సంస్థ ద్వారా కల్వర్టులను శాశ్వతంగా పునరు ద్ధరిం చాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వెంట మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, మున్సిపల్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, ఉన్నారు.