Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగిపొర్లుతున్న... వాగులు..చెరువులు.. కుంటలు
- ఊగ్రరూపం దాల్చిన దుందుబీ
- గ్రామాలకు నిలిచిన రవాణా సౌకర్యం
- గుర్రం గడ్డ మొదలుకొని ముక్కిడి గుండం దాక
- నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో ప్రజల అవస్థలు
పాలకుల వైఫల్యం వల్ల పాలమూరు జిల్లా ప్రజలు పండుటాకుల వణికిపోతున్నారు. పొంగిపోతున్న వాగులు వంకలు నిండి అలుగులు పారుతున్నాయి. చెరువులు, కుంటలతో గ్రామీణ జీవనం అస్థవ్యవస్తంగా మారంది. గుర్రం గడ్డ మొదలుకొని ముక్కిడి గుండం దాక అవస్థలు వర్ణనాతీతం. రెండేండ్లక్రితం మొదలు పట్టిన పూర్తి కాకపోవడం విడ్డురంగా ఉంది. ఇంకా నిర్మాణాలు మొదలు కాని పనుల వల్ల వరదలతో రాకపోకలు నిలిచిపోయాయి. ఇప్పటికైనా పాలకులు బ్రిడ్జి నిర్మాణాలు పూర్తి చేయాలని పలు పార్టీలు ప్రజా సంఘాలు కోరారు.
నవతెలంగాణ-మహబూబ్నగర్ ప్రాంతీయప్రతినిధి
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం ముక్కిడిగుండం,నార్లాపూర్ మద్యన ఉన్న పెద్దవాగు ఉదృతంగా ప్రవహిస్తోంది. గతంలో మంత్రిగా పనిచేసిన జూపల్లికృష్ణారావు పెద్దవాగు బ్రిడ్జీ నిర్మాణం కోసం బడ్జెట్ కేటాయించారు.నిర్మాణానికి సరిపడే బడ్జెట్ లేదన్న కారణంగా పనులు చేయలేదు. ఇప్పుడు వచ్చిన బడ్జెట్ సైతం ఇతర పనులకు మళ్లీంచారు. పెద్దవాగు ఉదృతి వల్ల పైగ్రామాలకు వెళ్లే వారికి కష్టంగా మారింది. తెలకపల్లి మండలం తాళ్లపల్లి పుల్జాల, తాడూరు మండలం గుట్టలపల్లి పొల్మూరు నాగర్కర్నూల్ మండలం గగ్గలపల్లి మంతటిగడ్డ గ్రామాల మద్య రాకపోకలు నిలిచిపోయాయి. ముఖ్యంగా నడిగడ్డ,తాళ్లపల్లి గ్రామాల ప్రజలు పక్షం రోజుల నుంచి గృహనిర్బంధం అయ్యారు. చుట్టు నీళ్లు రావడంతో పోయే దారిలేక తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. గద్వాల జిల్లా పరిధిలోని గార్లపాడు వాగు దాట కుండా ప్రవహిస్తోంది. దీంతో పల్లెపాడు, జల్లాపూర్, మోరెపల్లి, మారుమునగాల, అలంపూర్ గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి కోసం అనేక సార్లు అధికారులు, నాయకులను కలిసినా ప్రయోజనం లేదని ప్రజలు తెలిపారు. ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వావిలాల బ్రిడ్జీ లేక యాపదిన్నె, వెంకటాపూర్, శాంతినగర్, ఐజ గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. నెల రోజుల నుంచి రాకపోకలు ఆగిపోవడంతో జనజీవనం స్థంబించింది. వనపర్తి జిల్లా రేవల్లి మండలం కేశంపేట వాగు ఉదృతంగా వస్తోంది. వాగు ఉదృతంగా రావడం వల్ల చీర్కపల్లి,ఏదుల, చెన్నారం. కేశంపేట గ్రామస్తులు వ్యవసాయ పనులకు సైతం బయటకు వెల్లడం లేదు. ఎక్కడికి వెల్లాలన్నా... వాగు వస్తుండటంతో సాగు పనులు సైతం నిలిచిపోయాయి. వనపర్తి సమీపంలో ఉండే జేరిపోతుల వాగు పొంగిపోర్లుతోంది. ఇక్కడ బ్రిడ్జీ నిర్మాణం జరుగుతోంది. వాహనాల రాకపోకల కోసం వేసి ప్రత్యమ్నాయ రోడ్డు వరద ఉదృతికి ద్వంసం అయ్యింది. దీంతో డిగ్రీ కళాశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కల్గింది. గోపాల్పేట నుండి వచ్చే వాహనాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఎదుట్ల నుండి వచ్చే కేఎల్ఐ కాల్వ తెగిపోయి పంట పొలాలు నీటమునిగాయి. ఖిలాఘనపూర్ మండలం నుండి మహబూబ్నగర్ వెల్లే రహదారి వర్షం దాటికి కుంగిపోయింది. దీంతో ప్రధాన రహదారి రాకపోకలు నిలిచి వాహనదారులకు తీవ్ర అంతరాయం కల్గుతుంది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల నుంచి వచ్చే రహదారిలో అనేక చోట్ల ఇంకా బ్రీడ్జీల నిర్మాణాలు నిర్మాణాల్సింది.
బ్రిడ్జీలు నిర్మాణం చేయకపోవడం వల్ల జిల్లా వ్యాప్తంగా వాహనదారులకు ద్వీచక్ర వాహనాలు వెల్లడానికి తీవ్ర ఇబ్బంది కల్గుతోంది. కేసరి సముద్రం నుండి వచ్చే చిన్న వాగు తాళ్లపల్లి దగ్గర అసంపూర్ణ బ్రీడ్జి నిర్మాణం వల్ల ఓ యువకుడు వాగులో పడి కోట్టుకొని పోయాడు. రుఘుపతిపతి పేట నుండి తెలకపల్లి వెల్లే దారిలో దుందుబి నదిలో పక్షం రోజుల క్రితం ఓ ఆర్టీసి బస్సు అదుపు తప్పిపోయింది. ట్రాక్టర్ సహాయంతో దాన్ని బయటకు తీశారు. గురువారం సైతం నాలుగురు యువ కులు వరద నీటిలో చిక్కుకుంటే గ్రామస్తుల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. దుందుబి నది ఉదృతి వల్ల అనేక మంది అసౌకర్యాలకు గురైతున్నారు. ప్రజాప్రతినిధులు కలుగ చేసుకొని వెంటనే నదిపై వంతెన నిర్మాణం చేయాలని పలు పార్టీలు ప్రజాసంఘాలు కోరుతున్నాయి.
లోతట్టు ప్రాంతాల ప్రజలు రక్షించాలి
నాగర్కర్నూల్ జిల్లాలో 80 కిలోమీటర్ల మేర కృష్ణానది 70 కిలోమీటర్లు దుందుబి నది ప్రవహిస్తోంది. దీంతో అధికంగా వరదలు వస్తే...సమీప ప్రాంతాల ప్రజలు ఆవాసాలు నీటి ముంపుకు గురౌతారు. ముఖ్యంగా వాగులు వంకలు ఉన్న దగ్గర రోడ్డుకు బ్రీడ్జీ నిర్మాణాలు చేయాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం బ్రీడ్జీల నిర్మాణం విషయంలో అలసత్వం ప్రదర్శించరాదు. రహదారి వ్యవస్థ పటిష్టం కోసం వెంటనే బ్రీడ్జీ నిర్మాణాలు చేయాల్సి ఉంది.
- వర్థం పర్వతాలు, నాగర్కర్నూల్ జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి