Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఊరుకొండ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నిరుపేదలకు వరాలుగా మారాయని.. అభాగ్యులకు సీఎం సహాయ నిధి అండగా నిలుస్తుందని వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఊరుకొండ మండల పరిధిలో మాదారం గ్రామంలో లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందచేశారు. ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ సత్తి అరుణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పేదలకు వైద్య సేవలు భారం కావొద్దని రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు అందజేస్తున్నారని పేర్కొన్నారు. గత 8 సంవత్సరాలలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎంతోమంది అభాగ్యులకు కోట్ల రూపాయలను అందజేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని అన్నారు. దరఖాస్తు చేసుకొన్న అందరికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయాన్ని అందిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్య మంత్రి కేసీఆర్ అని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అమలవుతున్న ప్రతి పథకాన్ని అర్హులైన పేదలందరికీ అందిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవా లన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సహకారంతో మాధారం గ్రామానికి చెందిన పులిమామిడి కృష్ణారెడ్డికి రూ. 30,000/-, అంకూరి బాలయ్యకు రూ.21,000/-, చెక్కులను మాదారం గ్రామ తెరాస నాయకులతో కలిసి బాధితులకు అందజేశారు. కార్యక్రమంలో మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మన్నెం రవీందర్ రెడ్డి, గ్రామ తెరాస అధ్యక్షులు ఇషాక్, ఉప సర్పంచ్ హుస్సేన్, వార్డు మెంబర్లు ధ్యాప ఆల్వాల్ రెడ్డి, లస్కర్ రాజు, ముదివేంటి శ్రీను, టీఆర్ఎస్ నాయకులు వేముల రాములు, గోపాల శ్రీశైలం, రొట్టె వెంకటయ్య, ఆజాద్ బాబా, మ్యాదరి కృష్ణ, మ్యాకల రాములు,సందీప్ రెడ్డీ, డప్పు వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.