Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ మహబూబ్నగర్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం సమావేశాన్ని విజయవంతం చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా అధ్యక్షుడు పి.వెంకటస్వామి ఒక ప్రకటనలో తెలిపారు.శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని దళిత జర్నలిస్టుల ఫోరం కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలోని సాయి గార్డెన్లో నిర్వహించే ఉమ్మడి జిల్లా దళిత జర్నలిస్టుల ఫోరం సమావేశానికీ జిల్లాలో ఉన్న దళిత జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని సమావేశాన్ని విజయవంతం కోరారు.ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలను,రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు, జర్నలిస్టులు వత్తిలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యచరణ ప్రకటించాలని తెలిపారు. అందుకే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న దళిత జర్నలిస్టులు అందరూ ఐక్యంగా ఉండి తమ హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చాడు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళిత జర్నలిస్టుల ఫోరం వ్యవస్థాపకుడు, రాష్ట్ర అధ్యక్షుడు కాశపోగు జాన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డేవిడ్ మరియు ఇతర పెద్దలు హాజరవుతున్నారని కావున తప్పకుండా జిల్లాలో ఉన్న జిల్లాలో ప్రతి దళిత జర్నలిస్టులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ దళిత జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అవుట శ్రీను,నాగర్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు అవుట వెంకటస్వామి,రాష్ట్ర ఈసీ మెంబర్ వినోద్ పాల్గొన్నారు.