Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధికారులను ఆదేశించిన అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
నవ తెలంగాణ -వనపర్తి
మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన హరితహారం, మిషన్ భగీరథ, పారిశుద్ధ్యం, రోడ్ల విస్తరణ తదితర పనులను జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మున్సిపల్ అధికారులకు ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్లో మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన వివిధ పనుల పురోగతిపై మున్సిపల్ అధికారులతో ఆయన గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ ద్వారా ప్రభుత్వ ఆస్తిపన్ను వసూలు చేయడంలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇప్పటి వరకు 27 శాతం మాత్రమే వసూలు చేయడం జరిగిందని, వీటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వేగవంతం చేయాలని ఆయన తెలిపారు. వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన హరితహారం, బహత్ పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు, ట్రీ పార్క్, రెవెన్యూ ప్లాంటేషన్ తదితర పనులను ఎప్పటికప్పుడు పరిశీలించి, జాప్యం లేకుండా త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆయన సూచించారు. మునిసిపాలిటీలో చేపడుతున్న పారిశుద్ధ్యం, డంపింగ్ యార్డ్ నిర్మాణం, మరుగుదొడ్లు, చెత్తను సేకరించటం, సెగ్రేగేషన్, వైకుంఠ ధామాలు పనుల పురోగతిపై వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహా రెడ్డి, డి.ఈ.సూర్యనారాయణ, ఎఈలు భాస్కర్,హేమలత, శానిటేషన్ ఇన్ స్పెక్టర్ రమేష్, రెవెన్యూ అధికారి అనిల్, రెవెన్యూ, మెప్మా ఏవో, సిఓలు, సిబ్బంది, బిల్ కలెక్టర్లు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.