Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వనపర్తి : కేంద్ర ప్రభు త్వం కార్మి కుల కు వ్యతిరేకంగా తీసు కొచ్చిన నా లుగు లేబర్ కోడ్ విధా నాలను ప్రతి కార్మికు డూ ఎండ గట్టాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పిలు పు నిచ్చారు. సిఐటియు రేవల్లి మండల రెండో మహాసభలు అరుణ అధ్యక్షతన గురువారం మండల కేంద్రంలో నిర్వహించారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను తేవడంతో కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, ఎనిమిది గంటల పనిదినం తదితర హక్కుల పైన వేటు వేస్తుందన్నారు. దీని తీవ్రంగా సీఐటీయూ ఖండిస్తున్నదన్నారు. నరేంద్ర మోడీ అధికారంలోకొస్తే 100 రోజుల్లో ధరలు తగ్గిస్తానని హామీ ఇచ్చి, 63 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ రూ.111లు అయిందన్నారు. రూ.45లు ఉన్న డీజిల్ లీటరు రూ.95లు అయిందన్నారు. అనంతరం సీఐటీయూ రేవల్లి మండల నూతన కమిటీ కన్వీనర్‌గా వి.వెంకటయ్య, కమిటీ సభ్యులుగా 20 మందిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోపాలకృష్ణ , కార్మికులు, వీఆర్ఏలు, మధ్యాహ్న భోజన కార్మికులు, ఐకెపి వీవోఏలు పాల్గొన్నారు.